రాష్ట్రస్థాయి బాస్కెట్బాల్ పోటీలకు మహబూబాద్ జిల్లా గుండ్రాతిమడుగు జడ్.పి.హెచ్.ఎస్ విద్యార్థులు ఎంపికైనట్లు పాఠశాల హెచ్ఎం కే జానయ్య, ఫిజికల్ డైరెక్టర్ కమల్ కిషోర్ తెలిపారు. అక్టోబర్ 23న ఉమ్మడి వరంగల్ జిల్లా బాస్కెట్బాల్ అండర్ -14 విభాగాల్లో పాఠశాల విద్యార్థులు జి వినయ్, ఎం శరణ్య, సిహెచ్ సౌజన్య ఎంపికైనట్లు వారు తెలిపారు. ఎంపికైన క్రీడాకారులను ఉపాధ్యాయ బృందం, స్థానికులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం భద్రు, యాదగిరి, సురేష్, మహేష్, రమ, శ్రీధర్, రామ్ సింగ్, శోభ రాణి, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి బాస్కెట్బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థులు
21
Nov