సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషితోనే దేశం ఐక్యత

_ మహారాష్ట్ర రాజ్యసభ సభ్యులు డాక్టర్ అనిల్ సుక్దేవరావు బోండే_

మహబూబాబాద్ జిల్లా. ఎన్టీఆర్ స్టేడియంలో సర్దార్@150 యూనిటీ మార్చ్ ను ప్రారంభించిన మహారాష్ట్ర ఎంపీ, జిల్లా కలెక్టర్

మహబూబాబాద్: ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషితోనే దేశం నేటికీ ఐక్యతతో ఉందని మహారాష్ట్ర రాజ్యసభ సభ్యులు అనిల్ సుక్దేవరావు బోండే అన్నారు.

శనివారం మహబూబాబాద్ జిల్లా.ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణంలో కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు మై భారత్, ఎన్ఎస్ఎస్, ఎన్సిసి సంస్థల ఆధ్వర్యంలో సర్దార్@150 ఐక్యత పాదయాత్రను ఎన్టీఆర్ స్టేడియం నుండి కోర్టు సెంటర్ వరకు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి రాజ్యసభ సభ్యులు అనిల్ సుగ్దేరావు బొండే, కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పి సుధీర్ రామ్నాథ్ కేకన్, అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో (రెవెన్యూ) కె.అనిల్ కుమార్, పూలమాలవేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ భారతదేశ భిన్నత్వంలో ఏకత్వం, విడివిడిగా ఉన్న భారతదేశంలో ఏకతాటిపై నడిపించిన గొప్ప మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయన కొనియాడారు. భారతీయులమంతా స్వదేశీ వస్తువులనే ఉపయోగించాలని, పటేల్ అనుసరించిన దృఢ సంకల్పాన్ని నేటి యువతరం వారి అడుగుజాడల్లో నడవాలని, చెడు వ్యసనాలు మరియు డ్రగ్స్ మహమ్మారికి దూరంగా ఉండాలని వారు పిలుపునిచ్చారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత దేశంలో స్వేచ్ఛ కోసం తపించేవారని, ఎన్ని భాషలు మాట్లాడిన ఎన్ని ప్రాంతాలు ఉన్న మనమందరం ఒకటేనని చాటి చెప్పేవారని వివరించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా సంస్థానాలుగా విడివిడిగా ఉన్న దేశాన్ని ఒక్కటి చేయడంలో సర్దార్ పటేల్ కృషి చేశారన్నారు. భారత దేశ ప్రజల్ని చైతన్యపరిచి ఏకతాటిపై నడిపించిన మహనీయుడని కొనియాడారు. ప్రజలు ఆయన ఆశయ సాధన కోసం పని చేయాలన్నారు.అలాగే ఆత్మ నిర్భర్భారత్ ప్రతిజ్ఞ చేయించారు, అనంతరం మొక్క నాటి నీరు పోసి, జెండా ఊపి పాద యాత్రను ప్రారంభించారు,

ఈ కార్యక్రమంలో మేరా యువభారత్ వరంగల్ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేష్, సూపరిండెంట్ బానోతు దేవిలాల్, డివైఎస్ఓ, ఓలేటి జ్యోతి DIEO మదార్, మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్,MRO రాజేశ్వరరావు, డిపిఆర్ఓ రాజేంద్రప్రసాద్, ప్రభుత్వంచే నామినేట్ చేయబడ్డ మెంబర్స్ సింగారపు సతీష్ , తాడపూర్ణ చందర్, ప్రేమ్ రాయుడు మై భారత్ వాలంటీర్లు, బానోతు వీరన్న నాయక్, బాదావత్ సురేష్ నాయక్, వెల్దండ సురేష్, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ విజయ, మహిళా సంఘ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, సుమారు 1500 మందికి పైగా విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *