మరిపెడ
మరిపెడ మండల కేంద్రంలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని జి ఎన్ రెడ్డి హై స్కూల్ నందు చిన్నారి విద్యార్థుల చే జాతీయ నాయకుల వేషధారణలో అలరించి అదేవిధంగా పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులుగా స్వయం పరిపాలన దినోత్సవాన్ని జరుపుకున్నారు. డి ఈ ఓ గా ఆరవ తరగతి విద్యార్థునీ రేఖ దాక్షాయణి , పి ఏ గా ఇషాంత్ రాజ్, ప్రిన్సిపాల్ గా బీ కార్తిక్, కరస్పాండెంట్ పీ శివ, ఇంచార్జ్ గా బాల్ని వేదశ్రీ, ఉపాధ్యాయులుగా సౌమ్య, ఆలియా, విన్మయిరెడ్డి, వర్షిత, పకృత్, స్నేహన్స్ సాక్షిత జయ సూర్య , ఫర్విన్, జానీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ జి ఎన్ రెడ్డి ప్రిన్సిపాల్ ధనలక్ష్మి ఇంచార్జ్ సత్యపతి ఉపాధ్యాయులు బోడ మౌనిక, సంధ్యారాణి మనీషా, హేమలత ,సుజాత, శైలజ తదితరులు పాల్గొన్నారు.