మహబూబాబాద్:
మహబూబాబాద్ ఎంపీపీ ఎస్ బాలికల ప్రాథమిక పాఠశాలకు రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు శంఖాబాద్ నారాయణ ఐరన్ గేటు, పాఠశాల బోర్డు బహూకరించారు
ఈ సందర్భంగా పాఠశాల నేమ్ బోర్డు మరియు గేటును దాత REWA జిల్లా అధ్యక్షులు శ్రీ సంకా బద్రి నారాయణ గారు ప్రారంభించినారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామోజీ నాయక్ మాట్లాడుతూ దాతను అభినందించినారు, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఇంకా దాతలు ముందుకు రావాలి కోరినారు. ప్రభుత్వ పాఠశాల నాణ్యమైన విద్య అందుతుందన్నారు
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు కిషన్, సత్యవతి, నాగముని, వరలక్ష్మి ,లక్ష్మి, చామంతి ,సృజన, నవీన మరియు పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.