TCA ఆధ్వర్యంలో డిసెంబర్ మొదటివారంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి తెలంగాణ గోల్డ్ కప్ 2025 టి – 20 ఓపెన్ టు ఆల్ సెలక్షన్స్ లో పాల్గొనే జిల్లా జట్టు ఎంపికలను నేడు మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని స్థానిక ఎన్టీర్ స్టేడియం నందు నిర్వహించడం జరిగింది,అండర్ 19 అండర్ 23 అండర్ 30 వయస్సు గల క్రీడాకారులు ఈ ఎంపికలో హాజరయ్యారు,ఈ సెలక్షన్స్ ప్రారంభోత్సవానికి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ మహబూబాబాద్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు పల్ల రామచంద్రా రెడ్డి గారు విచ్చేశారు. ఈ సందర్భంగా వారు క్రీడాకారులను పరిచయం చేసుకున్న అనంతరం వారు మాట్లాడుతూ మానుకోట జిల్లా క్రీడలకు పుట్టినిల్లు అని ఈ సెలక్షన్స్ ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని ఈ గోల్డ్ కప్ లో పాల్గొనే జిల్లా జట్టు మొదట ఈస్ట్ జోన్ లో మంచి ప్రతిభ కనబర్చాలని మానుకోట జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కొనియాడారు.సుమారు 100 మంది క్రీడాకారులు ఈ సెలెక్షన్స్ లో పాల్గొన్నారు .ప్రాక్టీస్ మ్యాచు ల అనంతరం ఫైనల్ టీమ్ ను ఎంపిక చేస్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి సయ్యద్ జాకీర్ హుస్సేన్ కార్యదర్శి దేశబోయిన శ్రీనివాస్,sk. గౌస్,నగేష్, డోలి శివసాగర్ ,జమీర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
2025 T-20 జిల్లా క్రికెట్ జట్టు ఎంపికలు
23
Nov