మహబూబాబాద్ లో ప్రైవేట్ వైద్య సంస్థలపై విస్తృత తనిఖీలు

మహబూబాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. రవి రాథోడ్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ బృందం సోమవారం ప్రైవేట్ వైద్య సంస్థలపై విస్తృత తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా వెన్నెలా హాస్పిటల్, అమృత హాస్పిటల్ (మహబూబాబాద్) మరియు అర్జున్ డయాగ్నొస్టిక్ సెంటర్ (బయ్యారం)లను పరిశీలించారు.తనిఖీల సందర్భంగా ఆస్పత్రుల్లో క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ (రెగ్యులేషన్ & రిజిస్ట్రేషన్) యాక్ట్ – 2010 అమలు పరిస్థితిని వివరంగా పరిశీలించగా, యాక్ట్‌లో పేర్కొన్న కనిష్ట ప్రమాణాలు, నమోదు, సిబ్బంది అర్హతలు, రోగి రికార్డుల నిర్వహణ, పరికరాల ప్రమాణాలు, వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై ఆసుపత్రి నిర్వాహకులకు స్పష్టమైన సూచనలు జారీ చేయబడాయి.
ఈ సందర్భంగా ఆసుపత్రి నిర్వహకులకు కఠినంగా హెచ్చరిస్తూక్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ యాక్ట్ 2010 ను తప్పనిసరిగా అమలు చేయాలిరోగి భద్రత, సేవల నాణ్యతపై ఎటువంటి రాజీ ఉండకూడదుకనిష్ట ప్రమాణాలు పాటించనిపక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవని అని స్పష్టం చేశారు. జిల్లాలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఆయన తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *