మహబూబాబాద్
మార్గశిర శుద్ధ షష్టి బుధవారము ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర షష్టి సందర్భంగా శ్రీ శివ పంచాయతన పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం ఘనంగా జరిగినది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చక్కటి అభిషేకము కళ్యాణ మహోత్సవము దేదీప్యమానంగా జరిగినది. అనేకమంది దంపతులు కళ్యాణం పీటల మీద కూర్చున్నారు. మీ పూజారి రంగా వర్జల సుధాకర్ శాస్త్రి సునీత దంపతులు మరియు జంగాల సత్యవతి గారు పుప్పాల రాజశేఖర్ హైమావతి గారు తల్లాడ అంబరీష శ్రీదేవి గారు స్వామివారికి ప్రసాదాలు వస్త్రములు సమర్పించారు. అనేక మంది భక్తులు పాల్గొన్నారు.