మహబూబాబాద్: స్థానిక ఆర్ సి కన్వెన్షన్ సెంటర్ లో మహబూబాబాద్ జిల్లా స్థాయి చెకిముకి సైన్స్ సంబురాలు జరిగాయి. జిల్లా అధ్యక్షులు సాహితి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి దక్షిణామూర్తి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. నేటి పరిస్థితుల్లో అందరూ బిజీబిజీగా గడుపుతున్నారని, నేర్చుకున్న అంశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి దృక్పథమే ముఖ్యమని, జనవిజ్ఞాన వేదిక వంటి వేదికలు ప్రయత్నించడం శుభపరిణామమని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వృద్ధి చెందాలని కోరారు. అనంతరం జిల్లా స్థాయి చెకిముఖి సైన్స్ టాలెంట్ టెస్ట్ కు సంబంధించిన ప్రశ్న పత్రాలను విడుదల చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు డాక్టర్ నెహ్రూ, డాక్టర్ అనిల్ గుప్త, డాక్టర్ వెంకట్రాములు మాట్లాడారు. జన విజ్ఞాన వేదిక జిల్లా స్థాయి కార్యక్రమాలను ప్రజలలోకి విస్తృత స్థాయిలో తీసుకొస్తున్నామని, సమయాన్ని, డబ్బును విద్యార్థుల కోసం విశేషంగా ఖర్చు చేస్తూ, జనవిజ్ఞాన నాయకులు శ్రమిస్తున్నారని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వృద్ధి చెందాలని కోరారు. ప్రధాన వక్తగా, హాజరైన ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మరిపెడ ప్రిన్సిపాల్ టి జీవన్ కుమార్ తల్లిదండ్రులతో, గైడ్ టీచర్స్ తో ఇంటరాక్టివ్ కార్యక్రమం నిర్వహించారు. జీవితం అంటే చావు పుట్టుకల మధ్య ప్రయాణమని, ఆ అనుభవమే జీవితమని, ఎలా తీసుకోవాలనేది వ్యక్తి నిర్ణయించుకోవాలని, తెలియని స్థితి నుంచి తెలుసుకొనే స్థితిలోకి తీసుకరావడమే శాస్త్రీయ దృక్పధమని, ఆ ఆలోచన నుంచి వచ్చిన అంశమే శాస్త్రమని, అది సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించుకొనే ప్రయత్నం జనవిజ్ఞాన వేదిక చేస్తుందని, చెకిముఖి సైన్స్ సంబురాలు అందులో ఒక అంశమని, సైన్స్ ను సూడో సైన్స్ గా ప్రచారంలోకి తెచ్చే ప్రయత్నం జరుగుతోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. “సైన్స్ అండ్ టెక్నాలజీ” మీద ఏకశిలా ఏంజిల్స్, మహబూబాబాద్ విద్యార్థులు వేసిన స్కిట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి అప్పారావు, తెలంగాణ రాష్ట్ర జన విజ్ఞాన వేదిక సాంస్కృతిక శాఖ కన్వీనర్ లింగంపల్లి దయానంద్, రాష్ట్ర బాధ్యులు తడకమల్ల బ్రహ్మం, ఉమాదేవి, జిల్లా ప్రధాన కార్యదర్శి చొప్పరి శ్రీనివాస్, కోశాధికారి ఇమ్మడి సునీత, చెకిముఖి కన్వీనర్ సురేష్, సీనియర్ నాయకులు మైస నాగయ్య, వెంకట్రామ నర్సయ్య, ప్రసాద్ రావు, సాద్విమని, ఉప్పల శ్రీనివాసులు, సాంబయ్య, యాకయ్య,యాకన్న , సుందర్, సలీం, సుభాన్, నవీన్, రాం మోహన్, రామచంద్రయ్య, రవి, నరేందర్ రెడ్డి, బండారి నరేందర్, ముగ్గురు సునితలు, గాయత్రి జక్కి నాగేశ్వరరావు, భూక్యా నగేష్, రాజేశ్వరరావు, మోహన కృష్ణ, ఓం ప్రకాష్ గైడ్ టీచర్స్, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
నేటి విద్యార్థుల శాస్త్రీయ దృక్పదమే రేపటి భవిష్యత్తు కు పునాది జిల్లా విద్యాశాఖ అధికారి దక్షిణామూర్తి
28
Nov