డోర్నకల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే డి ఎస్ రెడ్యా నాయక్
మరిపెడ..
బిఆర్ఎస్ పార్టి సూచించిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకుందామని డోర్నకల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ అన్నారు.
మరిపెడ మండల కేంద్రంలో ఆదివారం జరిగిన బిఆర్ఎస్ సర్పంచ్ ఎన్నికల సన్నాహాక సమావేశంలో డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్యకర్త బిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకునే విధంగా సైనికుల్లా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నాయకులు గుడిపూడి నవీన్ రావ్, మాజీ ఎంపీపీ , మాజీ ఒడిసి ఏం ఎస్ చైర్మన్ మహేందర్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు గుగులోతు రాంబాబు, మాజీ సర్పంచ్ గాదె అశోక్ రెడ్డి, తాళ్ల పెళ్లి రఘు, గుడిపూడి శ్రీనివాసరావు, కొన్నే వెంకన్న, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పిటిసి బిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
బిఆర్ఎస్ పార్టి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి
30
Nov