కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వారికే పదవులు

డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రనాయక్

మరిపెడ మండలంలోని భార్గవ్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటినుంచి పార్టీలో కష్టపడి పనిచేసే వారికి పదవులు లభిస్తాయని వారిని తప్పకుండా పార్టీ గుర్తిస్తుందని అన్నారు.ప్రభుత్వ సంక్షేమ పథకాల ను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని. ప్రజలకు అందించే సన్న బియ్యం అలాగే రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంటును అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లి మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులను గెలిపించుకోవాలని సూచించారు. అనంతరం కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో భూక్య ఉమా మురళి నాయక్ ,మాలోత్ నెహ్రూ నాయక్, మాజీ సర్పంచ్ నూకల అభినవరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు పెండ్లి రఘువీరారెడ్డి, జిల్లా పార్టీ నాయకులు ఒంటికొమ్ము యుగంధర్ రెడ్డి, కాలం శ్రీనివాసరెడ్డి, కోట వెంకటరెడ్డి, నలబోలు శ్రీకాంత్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, గుగులోత్ రవి నాయక్, మరిపెడ పట్టణ టౌన్ అధ్యక్షులు షేక్ తాజుద్దీన్, ఐలమల్లు, గండి వీరభద్రం గౌడ్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *