అమ్మాపురం బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి ముద్దం సునీత వీరారెడ్డి
తొర్రూరు
ఆశీర్వదించండి… అభివృద్ధి చేసి చూపిస్తానని అమ్మాపురం బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి ముద్ధం సునీత వీరారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మండలంలోని అమ్మాపురం గ్రామంలో వార్డు సభ్యులతో కలిసి గడపగడపకు వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. అంతకు ముందు గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కొబ్బరికాయ కొట్టి మొక్కలు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి సునీత వీరారెడ్డి మాట్లాడుతూ.. సర్పంచ్ గా నన్ను గెలిపిస్తే అమ్మాపురం గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్ది, గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. ప్రజల హృదయాలలో నిలబడడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఅర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు, బీజేపీ నాయకులు, సీపీఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.