తొర్రూరు
ఆత్మ బలిదానాలు వద్దని పోరాటాలతోనే బీసీల 42 శాతం రిజర్వేషన్ సాధిద్దామని రాష్ట్ర ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కూరపాటి రమేష్ అన్నారు. ఆదివారం రాష్ట్ర బిసి, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్ చంద మల్లయ్య ఆధ్వర్యంలో బీసీ హక్కుల కోసం అమరుడైన సాయి ఈశ్వర చారి ఆశయ సాధన సభ, ఆయన ఆత్మ శాంతికి పట్టణ కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్ కూరపాటి రమేష్ మాట్లాడుతూ పార్లమెంట్ శీతాకాల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేయాలని, 42 శాతం బీసీ రిజర్వేషన్ ప్రకటించే వరకు ఉద్యమాలు చేస్తామన్నారు. అని రాజకీయ పార్టీలోని బిసి మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజీనామా చేసి బీసీ ఉద్యమంలోకి రావాలని కోరారు.ఈ కార్యక్రమంలో
ఇంటలెక్చువల్ ఫోరం చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ కె. వీరస్వామి, నాయకులు దామర ఉపేందర్, కొత్తూరు రమేష్, దొనికెన కుమారస్వామి,అన్నపురం వెంకన్న, కొదునూరి సుధాకర్, సాదు రాములు, మామిండ్లపల్లి నాగేష్, గంధం చంద్ర మూర్తి, పూసాల భాస్కరాచారి, పానుగంటి శీను, వంగాల సోమేశ్వర్,యాకయ్య తదితరులు పాల్గొన్నారు.