జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రవి రాథోడ్ సోమవారం గూడూరు మండలంలోని తీగలవేణి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని బొల్లపల్లి, తీగలవేణి సబ్ సెంటర్లను ఆకస్మికంగా సందర్శించారు.
ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలను 12 వారాల్లోపు తప్పనిసరిగా నమోదు చేయాలని మొదటి రెండు చెకప్లను PHC వైద్యాధికారితో, తదుపరి మూడో, నాలుగో చెకప్లను గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో పరీక్షా చేఇంచుకోవాలని, అవసరమైతే స్కానింగ్, స్త్రీ వైద్య నిపుణురాలి సేవలు పొందేలా చూడాలని సూచించారు.గర్భిణీలను హాస్పిటల్కు తీసుకురావడానికి 102 వాహన సేవను వినియోగించుకోవాలని సూచించారు.సాధారణ ప్రసవాలను ప్రోత్సహించలని, సిజేరియన్ శస్త్రచికిత్సలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.అసంక్రమిత వ్యాధులైన బీపీ, షుగర్, క్యాన్సర్ కోసం 30 ఏళ్లు పైబడిన ప్రతి వ్యక్తిని స్క్రీనింగ్ చేయాలి, అవసరమైన మందులను అందించాలి అని కోరారు, సబ్ సెంటర్ రికార్డులను, అందులోని జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు స్థితిని పరిశీలించారు.అన్ని జాతీయ కార్యక్రమాల్లోని డేటాను ఆన్లైన్ పోర్టల్లో సమయానికి అప్డేట్ చేయాలని సిబ్బందికి ఆదేశించారు, రికార్డులను పరిశీలించారు.
ఈ తనిఖీ లో వైద్యాధికారి డాక్టర్ రాంబాబు, హెల్త్ ఎడ్యుకేటర్ కె.వి. రాజు, షాను బేగం, రమేష్, ఫార్మసీ ఆఫీసర్ అమల, యు.డి.సి. ఉమామని , ఆరోగ్య కార్యకర్తలు కళావతి, శోభ, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.