కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం
గ్రామ గ్రామన ఎమ్మెల్యే మురళి నాయక్ కు డిసిసి అధ్యక్షురాలు ఉమా మురళి నాయక్ కు ఘన స్వాగతం పలికిన ప్రజలు
స్థానిక సంస్థలలో కాంగ్రెస్ నీ గెలిపించండి
స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ఎమ్మెల్యే మురళి నాయక్ , డిసిసి అధ్యక్షురాలు ఉమా మురళి నాయక్ గారి ఆధ్వర్యంలో ప్రచారం జోరుగా కొనసాగుతుంది…ఈ రోజు మహబూబాబాద్ మండలం లో వివిధ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే మరియు డిసిసి అధ్యక్షురాలు కోరారు…మహబూబాబాద్ మండలంలోని వివిధ గ్రామాల్లో బిఆర్ఎస్, బీజేపీ పార్టీల నుండి డిసిసి అధ్యక్షురాలు ఉమా మురళి నాయక్, ఎమ్మెల్యే మురళి నాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 10 ఏళ్ల బిఆర్ఎస్ పాలనలో పల్లెల్లో అభివృద్ధి జరగలేదని కేవలం గత నాయకుల జేబులు నింపుకున్నారు కానీ అభివృద్ధి చేయలేదని అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పే పార్టీ కాదని కాంగ్రెస్ పార్టీ కేవలం చేతల పార్టీ అని అన్నారు.నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించి గ్రామాల అభివృద్ధి చేసుకోవాలని కోరారు..సర్పంచ్ లను భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ మద్దతు దారులను గెలిపించి కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని అన్నారు.10 ఏళ్ల పాలనలో ఒక్క. రేషన్ కార్డు ఇయ్యకుండా ఒక్కరికి అయిన సన్న బియ్యం బువ్వ పెట్టకుండా ఉన్న బిఆర్ఎస్ పార్టీకి ఓట్లు అడిగే నైతిక విలువలు లేవని అన్నారు.. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారి వెంట జిల్లా నాయకులు ప్రకాశ్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షుడు మిట్టకంటి రాంరెడ్డి,మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.