కురవి మండల కేంద్రంలో Rs 1,50,000/- రూపాయిల విలువ గల 03 kG ల గంజాయి పట్టివేత

ఇద్దరి వ్యక్తుల అరెస్ట్

రురల్ Ci సర్వయ్య

జిల్లా Sp శ్రీ డాక్టర్ శబరిష్. పి IPS గారి ఆదేశాలు మేరకు గ్రామ పంచాయితీ ఎన్నికలలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం కురవి పోలీస్ స్టేషన్ Si గండ్రాతి సతీష్, Si జయకుమార్, సిబ్బంది తో కురవి -ఖమ్మం రోడ్ నందు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద వాహన తనిఖీ చేస్తుండగా ఒక ద్విచక్ర వాహనం నల్ల పెయింట్ వేసి నెంబర్ ప్లేట్ లేకుండా వస్తుండటం తో అట్టి వాహనం పై వున్న ఇద్దరు వ్యక్తులు తప్పించుకొనే ప్రయత్నం చేయగా పట్టుకొని వారి దగ్గర వున్న బ్యాగ్ ని తనిఖీ చేయగా నిషేధిత గంజాయి కనిపించి తూకం వేయగా 03 kg లు వున్నది. నిందుతుల పేర్లు తెలుసుకోనగ 1) పటేల్ పవన్ కృష్ణ s/o దేవేందర్, 23 సంవత్సరాలు r/o కరీంనగర్,

2) రెండవ వ్యక్తి ఓర్సు చందు s/o అంజయ్య, వయస్సు 20 r/o మల్యాల గ్రామం వీరిద్దరూ బైక్ పై విశాఖపట్నం అరకు వెళ్లి, అక్కడ తక్కువ లో గంజాయి 03 kg లు కొని, చిన్న చిన్న పాకెట్స్ చేసి మహబూబాబాద్ లో అమ్ముటకు తెస్తుండగా పోలీస్ వారికి పట్టుబడ్డారు. గంజాయి పట్టుకున్న కురవి Si గండ్రాతి సతీష్, Si జయకుమార్ మరియు సిబ్బంది ని జిల్లా Sp గారు, మహబూబాబాద్ DSP N తిరుపతిరావు గారు, రురల్ Ci P సర్వయ్య గారు అభినందించారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *