ఆశీర్వదిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా : బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి చెంచర్ల స్వాతి రాజు

తొర్రూరు :

త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ గా గెలిపిస్తే హరిపిరాల గ్రామంలో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి చెంచర్ల స్వాతి రాజు అన్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మండలంలోని హరిపిరాల గ్రామంలో స్థానిక నాయకులతో కలిసి గ్రామంలో ఇంటింట ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి స్వాతి రాజు మాట్లాడుతూ సర్పంచ్ ఎన్నికల్లో ఆశీర్వదించి గెలిపిస్తే గ్రామస్తులకు అందుబాటులో ఉండి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు కొండ వెంకన్న, నాయకులు రావుల సురేష్ రెడ్డి, బుర్రి మురళి, తోట మురళి,గద్దల బిక్షపతి, చినపాక శ్రీను, కమలాకర్, వెంకన్న, ఐలోని, రామ్మూర్తి, రేష్మ, సులోచన, మాధవి, ధనమ్మ, మల్లయ్య, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *