తొర్రూరు :
గ్రామసర్పంచ్ గా ఆదరించండి అమ్మాపురం గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి ముద్దం సునీత వీరారెడ్డి అన్నారు. సోమవారం గ్రామంలో కార్యకర్తలతో కలసి గ్రామంలో ఫుట్బాల్ గుర్తు ఓటు వేయాలని అభ్యర్థిస్తు ప్రచారం చేపట్టారు. ప్రచారంకు వెళ్తున్న సునీతవీరారెడ్డి ప్రజలు తమకు ఎల్లప్పుడు కష్టకాలంలో ఉండే వ్యక్తి అంటూ తమవెంటా ఉత్సహాంగా పాల్గొం టున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం హయంలో మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృషితోనే అమ్మాపురం అన్ని విధాలుగా అభి ద్ధి చెందిందన్నారు. ఇప్పటికే గ్రామంలో గుడి నిర్మాణాలు, కులాల వారికి కమ్యూనిటీహాల్స్ నిర్మాణం చేయడం జరిగిందన్నారు. ప్రచారంలో ప్రతి గడపకు వెళ్లి, చిన్నపెద్ద అనే తారతమ్యం లేకుండా చిరునవ్వుతో పలుకరిస్తూ ప్రధానంగా డ్రైనేజీ సమస్య ఉందని దాని పరిష్కారంకు కృషి చేస్తానని చెప్పారు. ప్రతి కాలనీకి సీసీ రోడ్ల నిర్మాణం, విద్యావంతుల కోసం ఉపాధి కల్పనకు కృషి చేస్తానని హామి ఇస్తూ ముందుకు సాగుతున్నారు. పల్లెలో మార్పు రావాలి అంటే బలమైన నాయకత్వం ఉండాలి… పనులు పూర్తి చేస్తా అంటూ ఆమె చెప్పే ప్రతిమాటతో ప్రజల్లో నూతన ఆశలను నింపుతోంది. నేను చేసిన సహయం మరిచిన ప్రజలే గుర్తు చేసుకుంటూ నా వెంట రావడం సంతోషకరంగా ఉందన్నారు.