ఘనంగా సోనియా గాంధీ గారి 79 వ పుట్టినరోజు

టిపిసిసి ఎస్టీ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ గుగులోతు వెంకట్ నాయక్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నర్సంపేట బైపాస్ నందు ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి సోనియా గాంధీ 79 వ పుట్టినరోజు కార్యక్రమాన్ని కేక్ కట్ చేసి పట్టణంలోని కాంగ్రెస్ కార్యకర్తల కోలాహలం నడుమ ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వెంకట నాయక్ మాట్లాడుతూ భర్త రాజీవ్ గాంధీ మరణానంతరం దేశ ప్రధానిగా అవకాశం వచ్చిన తను స్వీకరించకుండా పీవీ నరసింహారావు ని దేశ ప్రధానిగా నియమించారు,తరువాత 2004, 2009,ఎలక్షన్లో పార్టీ ఘనవిజయం సాధించి యూపీఏ పక్షానికి నాయకత్వం వహించి అధికారంలోకి రావడంతో తాను ప్రధానమంత్రి కావడానికి ఆస్కారము ఉన్న ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసి దేశ ఆర్థిక వేత్తగా ఉన్న మన్మోహన్ సింగ్ గారిని రెండు పర్యాయాలు ప్రధానమంత్రిగా నియమించి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు.సోనియా గాంధీ 1998 నుండి 2017 వరకు కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే అత్యధిక కాలం అధ్యక్షులుగా ఉన్నారు,సోనియా గారు ఒకేసారి రెండు పార్లమెంటు స్థానాలైనా బళ్లారి, ఆమెది నియోజకవర్గాల నుండి గెలుపొందారు,తరువాత వరుసగా నాలుగు సార్లు పార్లమెంటు సభ్యురాలుగా ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలుగా కొనసాగుతున్నారు.ప్రధానంగా తెలంగాణ ఉద్యమo ఉధృతంగా సాగుతున్న కాలంలో తెలంగాణలో విద్యార్థుల మరణాలను ఆపాలని ఒక కన్నతల్లిగా ఆలోచించి ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ నష్టపోయిన పరవాలేదని ఒక నిర్ణయానికి వచ్చి పార్లమెంట్లో ఎన్ని అవంతరాలు ఎదురైనా లోక్సభ స్పీకర్ మీరా కుమారి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల సహాయ సహకారాలతో తెలంగాణ బిల్లును పాస్ కావించి తెలంగాణ రాష్ట్ర సహకారానికి కారణమైంది. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీకి రుణపడి ఉన్నారని, దేశంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి అంటే నెహ్రు, ఇందిరా , సోనియాగాంధీ కుటుంబం తోటి మాత్రమే సాధ్యమవుతుందని,సోనియా గాంధీ సేవలను గుర్తించిన అనేక సంస్థలు ఆమెను గౌరవ డాక్టరేట్ అనేక పురస్కారాలతో గౌరవించాయి.దీనికి కొనసాగింపుగానే తెలంగాణ రాష్ట్రంలో నేడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగిందని,రాబోయే కాలంలో తెలంగాణతో పాటుగా దేశంలోనే సోనియా కుమారుడైన రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేంతవరకు తెలంగాణ ప్రజలు సోనియాగాంధీకి,కాంగ్రెస్ పార్టీకి అండదండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు నీరుటి లక్ష్మీనారాయణ,ఎండి అరుణ్,లింగాల వీరభద్రం గౌడ్,తేజావత్ శంకర్ నాయక్,సంపంగి రామచంద్రు,మాజీ వార్డు కౌన్సిలర్లు పోతురాజు రాజు, భూక్య లక్ష్మి , నిమ్మల శ్రీను,చలమల్ల నారాయణ,మహిళా నాయకురాలు సత్య మనోరమ, భూక్య విజయ,చెన్నూరి విజయలక్ష్మి ,వినమల్ల వెంకటస్వామి,గాడి పెళ్లి చరణ్,గాడి పెళ్లి వెంకన్న,ఎడ్ల రమేష్ ,మొగిలి ప్రసాద్,బోడ రవి నాయక్,ఎస్.కె గపూర్, బోడ రాము నాయక్, అల్లి దుర్గేష్, బొల్లు రాజు, పల్లపు అశోక్, రాగం రాంబాబు, వెంకటస్వామి,భూక్య విజయ, అనంతుల రాజమ్మ, పొన్నబోయిన మాధవి, నాగమణి,సుజాత, పద్మ,దేవి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *