కాంగ్రెస్​ ఆదివాసీ నేషనల్​ కోఆర్డినేటర్​ గా భూక్య శోభన్​ బాబు మహబూబాబాద్​ జిల్లా ఇనుగుర్తి వాసికి గుర్తింపు

మహబూబాబాద్ :

కాంగ్రెస్​ పార్టీ ఆల్​ ఇండియా ఆదివాసి కాంగ్రెస్​ నేషనల్​ కోఆర్డినేటర్స్​ ను పార్టీ జాతీయ ప్రధాన కేసీ వేణుగోపాల్​ ప్రకటించారు. మహబూబాబాద్​ జిల్లా ఇనుగుర్తి మండలం అయ్యగారి పల్లి గ్రామానికి భూక్య శోభన్​ బాబు​ ను నేషనల్​ కోఆర్డినేటర్​గా నియమించారు. 40 సంవత్సరాల వయస్సు ఉన్న శోభన్​ గత కొన్ని సంవత్సరాలుగా ఆయన కాంగ్రెస్​ పార్టీకి సేవలందిస్తున్నారు. ఉన్నత విద్యావంతుడైన శోభన్ బాబు ఇనుగుర్తిలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. ఉస్మానియా యూనివర్సిటి ఇంజనీరింగ్​ కాలేజీ నుంచి బీఈ పూర్తి చేశారు. బెంగళూరులోని ఇండియన్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ సైన్స్​ (ఐఐఎస్​సీ) ​ ఎంఈ పూర్తి చేశారు. హైదరాబాద్​ ఇండియన్​ స్కూల్​ ఆఫ్​ బిజినెస్​లో ఎంటర్​ప్రైన్యూర్​షిప్​ డెవలప్మెంట్​ ప్రొగ్రామ్​ (ఈడీపీ) పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటిలో ఎల్​ఎల్​ బీ చేశారు. 2024 లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా వరంగల్​, మహబూబాబాద్​, నెల్లూరులో పనిచేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థుల గెలుపునకు వార్​ రూంలో పనిచేశారు. నాగార్జున సాగర్​లో నిర్వహించిన కాంగ్రెస్​ ఆదివాసీ శిక్షణ కార్యక్రమంలో సపోర్ట్​ టీం మెంబర్​గా పనిచేశారు. ట్రైబల్​ హబ్​ను ఏర్పాటు చేశారు. ట్రైబల్​ ఇండియన్​ ఛాంబర్​ ఆఫ్​ కామర్స్​ అండ్​ ఇండస్ట్రీకి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. భూక్య శోభన్​ బాబు ఫౌండేషన్​ ఫౌండర్​ చైర్మన్​ పనిచేస్తున్నారు. ఈ ఫౌండేషన్​ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టారు. హైదరాబాద్​లో 7ఏఎం సూపర్​మార్కెట్​లను నిర్వహిస్తున్నారు. తనకు కాంగ్రెస్​పార్టీ ఆదివాసి నేషనల్​ కోఆర్డినేటర్​ గా నియమించిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖర్జున్​ ఖర్గే, లోక్​సభలో ప్రతిపక్ష నేత రాహుల్​ గాంధీ, సీఎం రేవంత్​ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్​ కుమార్​ గౌడ్​, జార్ఖండ్​ ఇంఛార్జి కొప్పుల రాజుకు, విక్రాంత్ భూరియా గారు, AICC ఆదివాసి విభాగం చైర్మన్ గారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని శోభన్​ బాబు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *