విద్యార్ధి సంఘాలచే విద్యార్థుల మానవ హారం ఉద్యమ స్ఫూర్తితో నిర్వహణ
మహబూబాబాద్ కు రైల్వే మెగా మెయిన్ టేనేన్స్ డిపో సాధనకు స్థానిక కుమరంభీమ్ విగ్రహం నుండి విద్యార్థు ర్యాలీ నిర్వహించి ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ లో మానవహారం నిర్వహించనైనది. ఈ సందర్బంగా విద్యార్ధి, డిపో సాధన కమిటీ బాధ్యులు మాట్లాడారు.
దక్షిణమధ్య రైల్వే జోన్ పరిధిలోని మహబూబాబాద్ లో 908.15 కోట్ల తో మెగా మెయిన్టెనెన్స్ డిపో ఏర్పాటు చేయుటకు అక్టోబర్ లోనే ఉత్తర్వులు విడుదల చేయడం జరిగినది. ఈ డిపో లో పీరియాడికల్ ఓవర్హాలింగ్, రెగ్యులర్ ఓవర్హాలింగ్, సిక్ లైన్, ట్రైన్ ఎగ్జామినేషన్ వంటి సదుపాయాలు ఉంటాయి. దీనివలన ఈ ప్రాంతం లో పరోక్షంగా ఉపాధి లభిస్తుంది.
కావున ఈ మెగా డిపో ను వదులు కోవడానికి ఇక్కడి ప్రజలు సిద్ధంగా లేరని, రైల్వే అధికారులు తమ నివేదికలో మానుకోట డిపో ఏర్పాటుకు అనువైన ప్రాంతంగా గుర్తించాలి.
ఇప్పటికే ఈ డిపో సాధనకు స్థానిక ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగానే ఉంది.
రాజకీయంగా ఇక్కడినుండి తరలించే ప్రయత్ననాన్ని ఉద్యమ స్ఫూర్తితో అన్నీ రాజకీయ, కుల, ప్రజా, విద్యార్ధి, ఇతర సంఘాలు అడ్డుకునే విదంగా ఒకే గొంతుకతో పోరాడుదామని వక్తలు తెలిపారు.
ఈ కార్యక్రమం లో విద్యార్ధి సంఘాలు SFI, PDSU, VJS, DSFI, రాజకీయ పార్టీ లు, కాంగ్రెస్, బి ఆర్ ఎస్, సిపిఐ ఎం ల్ న్యూ డెమోక్రసీ,TDP, TP JAC,కుల సంఘాలు LHPS, వడ్డెర సంఘం, రజక సంఘం, నాయి బ్రాహ్మణ సంఘం, ప్రైవేట్ అధ్యాపకుల సంఘం ,తెలంగాణ కళాకారుల సంఘం,మేరు సంఘాల బాధ్యులు పట్ల మధు,బోనగిరి మధు, నాగరాజు, ఇరుగు మనోజ్, కేలోత్ లోత్ సాయి, గుగులోత్ సూర్య ప్రకాష్, సాధన కమిటీ కన్వీనర్ డోలి సత్య నారాయణ,కో ఆర్డినేటర్ మైస శ్రీనివాసులు, ఖలీల్, md. ఫరీద్, గౌని ఐలయ్య, మండల వెంకన్న, ప్రేంచంద్ వ్యాస్,గుగులోత్ బీమానాయక్, నిమ్మల శ్రీను,బోడ రమేష్, Y. కృష్ణప్రసాద్,కుమ్మరికుంట్ల నాగన్న, సంపంగి రాంచంద్రు, షేక్ జానీ, సోమా విష్ణు వర్ధన్,దుగ్గి గోపాల్, అడపా మల్లికార్జున్, దుగ్గి లింగమూర్తి, కుర్ర మహేష్, md ఖాజా పాషా,ప్రసాద్ రమేష్, కంబాలపల్లి సత్యనారాయణ,హలవత్ లింగ్య, సామ పాపయ్య తదితరులతో పాటుగా వందలాది విద్యార్థులు పాల్గొన్నారు.