ఇటీవల మానుకోట జిల్లా కేంద్రానికి 908 కోట్లతో మంజూరైన రైల్వే మెగా మెయింటైన్స్ డిపో ప్రస్తుత పరిస్థితి ఏంటని నేడు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సిపిఐ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సారధి రెడ్డి ఆధ్వర్యంలో సిపిఐ ప్రతినిధి బృందం ఏవో గారికి సమాచార హక్కు చట్టం క్రింద దరఖాస్తు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా cpi మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ డి అజయ్ సారధి రెడ్డి మాట్లాడుతూ గతంలో బయ్యారం ఉక్కు పరిశ్రమ 2014 ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఉన్న బయ్యారం ఉక్కు పరిశ్రమలు 12 ఏళ్లు అయినా కూడా ఏర్పాటు చేయకపోగా నాణ్యత లేదని కేంద్రమంత్రి బిజెపి నేత కిషన్ రెడ్డి ప్రకటించారని ఇది ఈ ప్రాంతానికి తీరని నష్టమని తెలిపారు. పైగా ఇప్పుడు మహబూబాబాద్ జిల్లా పరిధిలో రైల్వే మెగా మెయింటెనెన్స్ డిపో వేరే ప్రాంతానికి తరలి పోతున్నదని జరుగుతున్న ప్రచారంపై బిజెపి ప్రభుత్వం నేతలు స్పందించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్థానిక ప్రజాప్రతినిధులు ఈ ప్రాజెక్టును వేరే ప్రాంతానికి తరలిపోకుండా చర్యలు తీసుకోవాలని లేని ఎడల ప్రజా ఆందోళనలు దశలవారీగా తప్పవని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెరుగు కుమార్ రే శ పల్లి నవీన్ జలగం ప్రవీణ్వెలుగు శ్రావణ్ తండా శ్రీనాథ్ ధారావత్ నరేష్ పాల్గొన్నారు.
రైల్వే మెగా మెయింటెనెన్స్ డిపో ప్రాజెక్ట్ యొక్క సంపూర్ణ సమగ్ర వివరములు సమాచారం ఇవ్వాలని ప్రస్తుత స్థితి ( STATUS ) తెలియజేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం క్రింద వివరాలను కోరిన సిపిఐ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి అజయ్ సారధి రెడ్డి మరియు ప్రతినిధి బృందం
16
Dec