జిల్లా న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ
రోడ్డు ప్రమాద బాధితులకు సత్వర న్యాయం చేకూర్చాలంటే లోక్ అదాలత్ వేదికను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ అన్నారు. మంగళవారం సాయంత్రం న్యాయమూర్తి బీమా కంపెనీ అధికారులు మరియు న్యాయవాదులతో దృశ్య మాధ్యమం ద్వారా సమావేశం నిర్వహించారు. ఈనెల 21న జరగబోయే జాతీయ లోక్ అదాలత్ లో ఎక్కువ సంఖ్యలో రోడ్డు ప్రమాద బీమా కేసులను పరిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదానికి కారణమైన వాహనానికి సంబంధించి అన్ని పత్రాలు సరిగ్గా ఉన్న కేసులను గుర్తించి లోక్ అదాలt ద్వారా పరిష్కరించాలన్నారు. లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించినట్లయితే కక్షిదారులకు డబ్బు సత్వరంగా అందటంతో పాటు భీమా కంపెనీ వారికి వడ్డీ లాభం చేకూరుతుందన్నారు. ఉభయ పక్షాలకు ప్రయోజనకరమైన లోక్ అదాలత్ ను వినియోగించుకోవాలని సూచించారు.