రైల్వే మెగా మెయింటెనెన్స్ డిపో ప్రాజెక్ట్ సాధనకై సమావేశమైన 8 రాజకీయ పార్టీల ఐక్యవేదిక

ఐక్య బలమైన ప్రజా ఉద్యమం ఒకవైపు రాజకీయ లాబింగ్ మరోవైపు చేయాలని తీర్మానం

ఉద్యమ కార్యాచరణలో భాగంగా దశల వారి జిల్లా వ్యాప్త ప్రజా ఆందోళన లకు పిలుపునిచ్చిన
8 రాజకీయ పార్టీల జిల్లా నేతల ప్రకటన

మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో పెరుమాండ్ల జగన్నాథం హాల్లో జరిగిన 8 రాజకీయ పార్టీల సమావేశంలో సిపిఐ సిపిఎం కాంగ్రెస్, బిఆర్ఎస్ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ టిడిపి,బీఎస్పీ పార్టీల నేతలు బి విజయ సారధి, సాధుల శ్రీనివాస్, ఘనపురపు అంజయ్య, మండల వెంకన్న, ఎడ్ల వేణు మాధవ్, కొండపల్లి రామచంద్ర రావు, కొత్తపల్లి రవి, ఇసంపల్లి ఉపేందర్ మాట్లాడుతూ రైల్వే పరిశ్రమ సాధనకై ఐక్యంగా పోరాటం నిర్వహిస్తామన్నారు. భవిష్యత్తులో ప్రజా ఉద్యమం ద్వారా రైల్వే పరిశ్రమ సాధిస్తాం అన్నారు. పరిశ్రమ సాధనలో స్థానిక ఎమ్మెల్యే మురళి నాయక్ ఎంపీ బలరాం నాయక్ చొరవ చూపి బాధ్యత తీసుకోవాలన్నారు రైల్వే సాధన పోరాటానికై రాజకీయ ఐక్యవేదిక మరియు ప్రజా సంఘాల జేఏసీ ని కలుపుకపోవాలని తీర్మానించడం జరిగిందన్నారు. ఈ ఉద్యమాన్ని మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా గ్రామస్థాయికి వరకు తీసుకపోవడానికి సమావేశంలో నిర్ణయించినట్టు అదేవిధంగా రేపు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ గారిని కలిసి రైల్వే పరిశ్రమ సాధనకై మాట్లాడతామన్నారు. ఈ సమావేశంలో బి అజయ్ సారధి రెడ్డి, సూర్యనపు సోమయ్య, బానోత్ రవికుమార్ ,రామగోని రాజు గౌడ్, హెచ్ లింగయ్య ,ప్రేమ్చంద్ వ్యాస్, ఉమ్మ గాని సత్యం, సురేష్ నాయుడు ,ఆకుల రాజు ,గుణగంటి రాజన్న, సమ్మెట రాజమౌళి, పెరుగు కుమార్ ,చింతకుంట్ల వెంకన్న, వెలుగు శ్రావణ్ , కుమ్మరి కుంట్ల నాగన్న, హిమానాయక్, సామ పాపయ్య, బూర్గుల వీరస్వామి, దేవేందర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *