నూతన సర్పంచ్లు గ్రామానికి మంచి సేవ చేసి ప్రజల మన్ననలు పొందాల : ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్
మహబూబాబాద్ నియోజకవర్గం
గూడూరు మండల కేంద్రంలోని కన్యకాపరమేశ్వరి ఫంక్షన్ హల్ లో గూడూరు మండల కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నూతన సర్పంచ్ ల ,ఉపసర్పంచుల అభినందన సమ్మేళన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మహబూబాబాద్ శాసనసభ్యులు డా భూక్యా మురళీ నాయక్ మాట్లాడుతూ ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ప్రజలు ఇచ్చిన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తూ, గ్రామాల్లో సర్వతోముఖాభివృద్ధి సాధించాలన్నారు. రానున్న ఎం పీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ శ్రేణులు ఐక్యంగా ఉండి నియోజకవర్గంలో అన్నిస్థానాల్లో విజయం సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మండల నాయకులు, పట్టణ నాయకులు, యూత్ నాయకులు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు వార్డ్ మెంబర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు