ప్రజా ప్రతినిధులు అంటే బలరాం నాయక్ లాగ ఉండాలి – ప్రజల ప్రశంసలు
శ్రీ పోరిక బలరాం నాయక్ చారిటబుల్ ట్రస్ట్ సేవలు ప్రశంసనీయం అని దేశంలో ఏ ఎంపీ కూడా చెయ్యని విధంగా ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయడం ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ తెలిపారు…
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని యశోద గార్డెన్ లో పలు కార్పొరేట్ హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది.పల్నాలజీ,గ్యాస్ట్రో,కార్డియాలజీ,అర్థోమాలజీ, ENT,జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, గైనాలజీ,ఆప్తమలజీ,ECG,2D వంటి స్పెషలిటీలు రోగులకు వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ మాట్లాడుతూ దేశంలో ఏ ఎంపీ చెయ్యని విధంగా పేద ప్రజల ఆరోగ్య కోసం మానుకోట పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం ఆదర్శనీయం అని కొనియాడారు…
ఉపిరి ఉన్నంత వరకు మానుకోట పార్లమెంట్ ప్రజల కోసం పని చేస్తా…
మానుకోట పార్లమెంట్ పరిథిలో ఉన్న ప్రజలకు సేవ చేయడం నా జన్మ సుకృతం అని మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ ఉద్వేగంగా మాట్లాడారు… నాకు ఉపిరి ఉన్నంత వరకు మానుకోట ప్రజలకు కంటికి రెప్పలా కాపాడుకుంటానని అన్నారు.పేద ప్రజలకు ఆరోగ్యవంతమైన జీవనం కోసం హైదరాబాద్ నుండి మరియు వరంగల్ నుండి కార్పొరేట్ డాక్టర్లచే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరగింది అని తెలిపారు.
దీంతోపాటుగా తమ పేరిట చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి పేదలకు తమ వంతుగా సేవలు అందిస్తున్న ట్రస్ట్ నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు…
ఈ కార్యక్రమంలో కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవ్ రెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎదల్ల యాదవ రెడ్డి,మండల అధ్యక్షులు అల్లం నాగేశ్వరరావు,గొల్లపల్లి ప్రభాకర్,మాజీ జడ్పీటీసీ హెచ్.వెంకటేశ్వర్లు,మాధవపెద్ది అమరేందర్ రెడ్డి,నిర్వాహకులు వంశీ నాయక్,రియాజ్ అన్సారీ,అరుణ్ నాయక్,షేక్ ముజ్జు, వినయ్, ప్రముఖ డాక్టర్ సాంబశివరావు, గ్లెనీగల్స్ హాస్పిటల్ డాక్టర్లు మురళీధర్,సాకేత్,చందన్ కుమార్,సతీష్,ఓబుల్ రెడ్డి,మౌనిక,మెడికవర్ హాస్పిటల్ డాక్టర్లు సింధూజ,సనత్, సంతోష్ మరియు వారి బృందం తదితరులు పాల్గొన్నారు…