మహబూబాబాద్ :
భారత మాజీ ప్రధాని చరణ్ సింగ్ జన్మదిన పురస్కరించుకొని జాతీయ రైతు దినోత్సవాన్ని మంగళవారం మహబూబాబాద్ విద్యా భారతి పాఠశాలలో విద్యార్థులు విద్యార్థులు ఘనంగా రైతు వేషధారణతో వ్యవసాయం పనులను చేశారు.
దేశ అభివృద్ధిలో రైతుల పాత్రను గౌరవించేందుకు పాఠశాల లో జాతీయ రైతు దినోత్సవాన్ని జరిపారు. వ్యవసాయం భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక రైతుల దేశానికి ఆహార భద్రత అందిస్తారు విద్యార్థులకు రైతులకు సమస్యలపై అవగాహన పెంపొందించడం రైతుల కృషికి గౌరవం తీసుకురావడం ఆధునిక వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడంతో పాటు విద్యార్థులు పాఠశాల ఆవరణలో ఉన్న నాలుగు ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో విద్యార్థులు మమేకమై సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయ పంటలు పండించడంలో మెలకువలు తెలుసుకొని 20 రకాల కూరగాయలను పండించడంలో విద్యార్థులు ఎంతగానో తెలుసుకొని రైతు యొక్క కష్టాన్ని స్వయంగా గుర్తించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ తక్కెళ్ళపల్లి ప్రభాకర్ రావు పాల్గొని విద్యార్థులు ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో మెలకువలు తెలుసుకుని ముందుకు సాగాలని యువత వ్యవసాయ రంగంలో నైపుణ్యత సాధించి దేశాభివృద్ధికి పాటుపడాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ నరోత్తం రెడ్డి ఇన్చార్జి సుష్మిత ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు