మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి అజయ్ సారధి రెడ్డి రచించిన సిపిఐ శతాబ్ది పాట ఆవిష్కరణ

Cpi రాష్ట్ర సమితి నిర్మాణ సౌజన్యంతో రాష్ట్ర, కౌన్సిల్ సభ్యుడు, సిపిఐ మహబూబాబాద్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి అజయ్ సారధి రెడ్డి రచించిన సిపిఐ శతాబ్ది పాట ఆవిష్కరణ నేడు సిపిఐ రాష్ట్ర కార్యాలయం భవన్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, cpi జాతీయ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే కే రామకృష్ణ ఆవిష్కరించారు.

మహబూబాబాద్ :

మానుకోట పట్టణానికి చెందిన సిపిఐ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు బి అజయ్ సారధి రెడ్డి రచించిన సిపిఐ 100 సంవత్సరాల సిపిఐ 1000 ఏళ్లు వర్ధిల్లు, శతాబ్ది సిపిఐ శతాబ్దాలు గా సాగిపో అనే పాటను లోగో తో నేడు సిపిఐ రాష్ట్ర కార్యాలయం మగ్దున్ భవన్ లో ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ, మాజీ జాతీయ కార్యదర్శి అజీజ్ పాషా మరియు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్ళపల్లి శ్రీనివాసరావు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు భాగం హేమంతరావు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జిల్లా కార్యదర్శి బి విజయసారథి, మరియు పంజాల రమేష్ ఆధ్వర్యంలో పాట ను లోగో తో ఆవిష్కరించడం జరిగింది . ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మరియు జాతీయ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే కే రామకృష్ణ నువ్వు మాట్లాడుతూ పాట రాసిన బి అజయ్ సారధి రెడ్డి గారికి అభినందనలు తెలిపారు గతంలో మూడు దశాబ్దాల తెలంగాణ జాతి పోరు పాటను కూడా రచించి నిర్మించడం జరిగింది అన్నారు నాడు రాష్ట్ర మంత్రులు, తుమ్ముల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నాడు ఆవిష్కరించా రన్నారు సిపిఐ 100 సంవత్సరాల సందర్భంగా సిపిఐ చరిత్రను పోరాటాన్ని తన పాట ద్వారా రాసిన బి అజయ్ సారధి రెడ్డి భవిష్యత్తులో ఇంకా మంచి పాటలు రాసి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్ష వెలిబుచ్చారు ఈ పాట నాడు సిపిఐ స్వాతంత్ర పోరాటం నుండి నేటి వరకు చేసిన పోరాటాలన్నీ మరోసారి గుర్తు చేసిన బి అజయ్ సారధి రెడ్డి గారికి రాష్ట్ర పార్టీ వైపు నుంచి ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా ఈ పాటను 1925 డిసెంబర్ 26న ఆవిర్భవించి నేటికీ ఉండేళ్లు పూర్తి కావస్తుంది అన్నారు ఈ పాటకు స్వరకల్పన మరియు గానం సారిహరన్,, ఈ పాటకు సంగీతం నేను ముంబైకి రాను పాట ద్వారా ప్రపంచాన్ని సైతం ఉర్రూతలూగించిన మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ కిస్ ఈ పాటకు సంగీతాన్ని అందించడం జరిగింది ఈ పాటకు గాన సహకారం బండ వెంకన్న కే పాండురంగ చారి కేదాసు రమేష్ అందించారు.
ఈ కార్యక్రమంలో పాట రచయిత బి అజయ్ సారధి రెడ్డి పెరుగు కుమార్ కట్లోజు పాండురంగాచారి వీరవెల్లి రవి వెలుగు శ్రావణ్, కేదాసు రమేష్ అనిల్ నరేష్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *