విద్యుత్ సవరణ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి
ప్రజాసంఘాల నేతల డిమాండ్
మహబూబాబాద్ :
పార్లమెంట్ సమావేశాల్లో దేశానికి అత్యంత ప్రమాదకరమైన నాలుగు చట్టాలను బిజెపి ప్రభుత్వం ఆమోదముద్ర వేసుకున్నది ప్రజలకు తీవ్ర నష్టాన్ని కలిగించే ఈ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గునిగంటి రాజన్న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అల్వాల వీరయ్య సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కుమ్మరి కుంట్ల నాగన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు డిసెంబర్ 24 బుధవారం రోజున మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వివేకానంద సెంటర్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విద్యుత్ సవరణ చట్టప్రతులను తగలబెట్టారు అనంతరం వారు మాట్లాడుతూ ఇప్పటి వరకు విద్యుత్ పంపిణీ వ్యవస్థ 99 శాతం ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి వాటిని కార్పొరేట్లకు కట్టబెట్టుటకు బిజెపి ప్రభుత్వం పూనుకున్నదని ఈ చట్టం వల్ల క్రాస్ సబ్సిడీ రద్దయి రైతులు పేదలు ఉచిత విద్యుత్ సౌకర్యం కోల్పోతారు సబ్సిడీ మీద విద్యుత్ పొందుతున్న ఆసుపత్రులు విద్యాసంస్థలు సౌకర్యం కోల్పోతాయి కొత్త చట్టం ద్వారా విద్యుత్ లైన్ లను ప్రైవేటు కంపెనీలు వాడుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు నాలుగు లేబర్ కోడుల వల్ల కార్మికులు సమ్మె హక్కు కోల్పోయి వేతనాలు అడిగే శక్తి కోల్పోతారని అన్నారు ఉపాధి హామీ చట్టాన్ని ఒక పథకంగా మార్చి గత ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున ఈ చట్టాన్ని నిర్వీర్యం చేయుటకు గాంధీజీ పేరు మార్చి ఉపాధికి దూరం చేశారని వారన్నారు ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోకపోతే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో భద్రయ్య చందు మధు రజాక్ రాజేష్ దర్గేష్ రవీందర్ గడ్డం ఎల్లయ్య ఆవుల ఈరన్న వెంకన్న రాజు శ్రీను ముత్తయ్య శ్రావణ్ వెంకటేష్ ఆజాద్ శంకర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు