సైబర్ నేరాల కట్టడికి అప్రమత్తతే ఆయుధం: మహబూబాబాద్ డీఎస్పీ ఎన్. తిరుపతిరావు

మహబూబాబాద్ :

సైబర్ నేరాలు రోజురోజుకూ కొత్త రూపాల్లో పెరుగుతున్న నేపథ్యంలో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మహబూబాబాద్ డీఎస్పీ ఎన్. తిరుపతిరావు అన్నారు.

తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న “ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్” కార్యక్రమంలో భాగంగా ఈరోజు మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ స్కూల్‌లో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.

ఈ కార్యక్రమంలో డీఎస్పీ మాట్లాడుతూ, టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ సైబర్ నేరాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయని తెలిపారు. ఆన్‌లైన్ పరిచయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, తెలియని వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్‌కు స్పందించవద్దని సూచించారు. లోన్ యాప్స్, బెట్టింగ్ యాప్స్ వాడటం వల్ల వ్యక్తిగత సమాచారం సైబర్ నేరస్తుల చేతికి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

పోలీస్, సీబీఐ అధికారులమని చెప్పుకుంటూ వీడియో కాల్స్ చేసి మోసాలకు పాల్పడుతున్న ఘటనలు జరుగుతున్నాయని, అలాంటి కాల్స్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించవద్దని తెలిపారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్లలో నమోదవుతున్న సైబర్ నేర కేసులను ఉదాహరణగా వివరించారు.

ఎవరైనా సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 టోల్‌ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ రూరల్ సీఐ సర్వయ్య, కురవి ఎస్‌ఐ గండ్రాతి సతీష్, సైబర్ క్రైమ్ ఎస్‌ఐ కరుణాకర్ పాల్గొన్నారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *