కెసిఆర్ పాలనను కోరుకున్న పల్లె ప్రజలు-అమ్మాపురంను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తా–మాజీ మంత్రి దయాకర్ రావు

తొర్రూరు :

కెసిఆర్ పాలనను పల్లె ప్రజలు కోరుకుంటున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం అన్నారు.

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం అమ్మా పురం గ్రామంలో బీఆర్‌ఎస్ పార్టీ మద్దతుతో గెలిచిన నూతన సర్పంచ్ ముద్దం సునీత వీరారెడ్డి, ఉప సర్పంచ్ సిరిపాటి విశాల్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు.అనంతరం నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి మాజీ మంత్రి దయాకర్ రావు ముఖ్యఅతిథిగా హాజరమయ్యారు.ఈ సందర్భంగా సర్పంచు, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను సత్కరించి అభినందించారు.అనంతరం దయాకర్ రావు మాట్లాడుతూ 10 ఏళ్లలో కెసిఆర్ చేసిన అభివృద్ధిని గ్రామీణ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. తాను మంత్రిగా ఉండి మంజూరు చేసిన నిధులను ఆపేశారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రంలో 4వేల సర్పంచులను బీఆర్‌ఎస్‌ గెలిచిందన్నారు.పార్టీ గుర్తులు లేని సర్పంచ్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గూబ గుయ్యిమనిపించారని,రేపు జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల్లో సీఎం రేవంత్‌కు మైండ్ బ్లాక్ అవుతుందన్నారు.బీఆర్ఎస్ సర్పంచ్ ల విజయం చూసి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పెట్టే ధైర్యం రేవంత్ రెడ్డి చేయడం లేదన్నారు. జిల్లాలోని భారీ మెజార్టీతో గెలిచిన అమ్మాపురం గ్రామాన్ని తాను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని అన్నారు.ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయాలని,అధికారం లేదని అధైర్య పడద్దని అన్నారు. బాధ్యతను నిలబెట్టుకోవాలని కొత్త సర్పంచులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు,మాజీ జెడ్పిటిసి మంగళపల్లి శ్రీనివాస్, మాజీ ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య, బిఆర్ఎస్ గ్రామ ప్రధాన కార్యదర్శి కొత్తూరు రమేష్, మాజీ సర్పంచ్, ఎంపీటీసీలు కడెం యాకయ్య దొనక ఉప్పలయ్య, సిపిఐ తమ్మెర విశ్వేశ్వరరావు,బిజెపి రూరల్ అధ్యక్షులు గట్టు రాంబాబు,ఆయా పార్టీల నాయకులు తమ్మెర వీరభద్రరావు,కొత్తూరు బ్రహ్మయ్య, కడారి జయసింహారెడ్డి, నరసింహారెడ్డి,వెంకటేశ్వర్లు,తులసి రామ్,రాజు తదితరులు పాల్గొన్నారు.
Sir namaste sir

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *