మహబూబాబాద్ :
మహబూబాబాద్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని విజయనిర్మల జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్ (ఆత్మ) గా వరంగల్ వెళుతున్న సందర్భంలో జిల్లా అధికారులు డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, జెడ్పి సీఈవో పురుషోత్తం, ల్యాండ్ సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ నరసింహమూర్తి, హార్టికల్చర్ అధికారి మరియాన్న, పరిశ్రమల శాఖ అధికారి శ్రీమన్నారాయణ రెడ్డి, డీఎం సివిల్ సప్లై కృష్ణవేణి, డిపిఆర్ఓ రాజేంద్రప్రసాద్, అగ్రికల్చర్ శ్రీనివాసరావు, మురళి, హార్టికల్చర్ సూపర్డెంట్ శ్రీనివాస్, తదితరులు ఘనంగా శాలువాతో సన్మానించారు. ఉద్యోగుల సర్వీసులో బదిలీలు, పదోన్నతులు సహజమని ప్రభుత్వ లక్ష్యాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరవేయడంలో కీలక పాత్ర వహించిన విజయనిర్మల గారి సేవలను కొనియాడారు, నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన వ్యవసాయ శాఖ అధికారిని సరితను అభినందించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యాలయ సిబ్బంది జావేద్, ఏవోలు అన్ని విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.