స్త్రీల విద్య, మహిళల హక్కులపై సెమినారులో మాట్లాడుతూ
గిరిజన సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుగులోతు కిషన్ నాయక్
మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో ఆదివారం సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో హెచ్ డబ్ల్యు ఓ సుజాత అధ్యక్షతన మహిళ చైతన్య మూర్తి క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే జయంతిని గిరిజన సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గూగులోత్ కిషన్ నాయక్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కిషన్ నాయక్ మాట్లాడుతూ భారతదేశంలో అనేక సంవత్సరాలు అభివృద్ధికి దూరంగా విద్యకు దూరంగా అణిచివేతకు దూరంగా ఉన్న మహిళల కోసం విద్యనందించిన దీరవనిత భారతదేశంలో మొట్టమొదటి మహిళా టీచర్గా ఉంటూ మహిళ హక్కుల కోసం, స్వేచ్ఛ కోసం సమానత్వం కోసం కృషిచేసిన త్యాగశీలి సావిత్రిబాయి పూలే. రాజ్యాంగంలో మహిళలకు అట్టడుగు వర్గాలకు పీడత శ్రామిక వర్గాలకు హక్కులు కాపాడుకోవడం కోసం విద్య ద్వారానే మార్పు వస్తుందని సమాజంలో మహిళా విలువల కోసం పోరాటానికి సిద్ధం కావాలని గుగులోత్ కిషన్ నాయక్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఏఎస్డబ్ల్యూ శివప్రసాద్, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి దొడ్డెల రామ్మూర్తి కళాశాల వసతిగృహ బాలికలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు..