మహబూబాబాద్ :
ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సీనియర్ సివిల్ జడ్జి షాలినీ షకేలీ అన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాలను పురస్కరించుకొని మహబూబాబాద్ పట్టణంలో ట్రాఫిక్ నియమాలు పాటించవలసిన జాగ్రత్తలపై జిల్లా రవాణా శాఖ & జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థ వాహన డ్రైవర్లకు హెల్మెట్ వాడకం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతీ ఒక్కరు బాధ్యతయూతంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పక్కగా పాటించడం, జీబ్రా క్రాసింగ్ లను వినియోగించడం, ట్రాఫిక్ సిగ్నల్ అనుసరించడం, వాహనాలను ఓవర్టేక్ చేయడం, రోడ్డు ప్రమాదాల నివారణకు పక్కాగా పాటించవలసిన అంశాలు, సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, అధిక దూరం ప్రయాణించినప్పుడు విశ్రాంతి తీసుకోవడం, శీతాకాలం వర్షాకాలం లలో రోడ్డుపై ప్రయాణించే సమయాలలో తీసుకోవలసిన జాగ్రత్తలు, తదితర అంశాలపై అందరికీ అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పించారు, జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు, తేదీ జనవరి 1 నుండి 31 వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమములో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ సాయి చరణ్, వెంకట్ రెడ్డి, ట్రాఫిక్ ఎస్ ఐ అరుణ్ నిర్వహించారు.