ఘనంగా లక్ష్మీ నరసింహ స్వామి – లక్ష్మీ దేవి ల కళ్యాణం.
నేరడ గ్రామంలో ఆధ్యాత్మిక శోభ
మహబూబాబాద్ జిల్లా కురవి :
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నేరడ గ్రామంలో స్వయంభూ వెలసిన శ్రీ లక్ష్మి నర్సింహా స్వామి – లక్ష్మీ దేవి ల కళ్యాణం స్వస్తి శ్రీ విశ్వవసు మాఘ మాసం పౌర్ణమి ఆదివారం కమనీయంగా రమణీయంగా కన్నుల పండుగగా జరిగింది.గ్రామంలో ఈ ఆధ్యాత్మిక శోభ నెలకొంది.గ్రామస్తులు,ప్రజలు,భక్త్తులు భారీ సంఖ్యలో చేరుకొని పూజలు నిర్వహించారు.ఉదయం స్వామివారికి విశేష అభిషేకం మధ్యాహ్నం శ్రీ లక్ష్మీనరసింహస్వామి లక్ష్మీ 12:21 నిమిషాలకు దేవి ల వారి దివ్య కళ్యాణ మహోత్సవం పూర్వం నుండి ప్రతి సంవత్సరం మాఘమాసం పౌర్ణమి రోజున తిథి తో ఆ రోజు ఆదివారం గ్రామ పెద్దలు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున అందరు కలిసి కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుంది.ఈ కార్యక్రమానికి గ్రామంలోని కల్యాణంలో కూర్చునే వారి ఇంటి నుండి మంగళ వాయిద్యాలతో డప్పు చప్పుళ్లతో మంగళ పూజా సామాగ్రి తీసుకెళ్తారు.అలానే ప్రతి సంవత్సరం మాఘమాసం రోజు శ్రీ లక్ష్మీనరసింహస్వామి – లక్ష్మీ దేవి ల కల్యాణానికి పూలమాలల, కన్యా దాన సామాగ్రి బాల్నే మృత్యుంజయ – దేవకమ్మ గారల ఇంటి దగ్గర గ్రామ పెద్దలతో కలిసి తీసుకెళ్లడం జరుగుతుంది.ఈ అభిషేక కార్యక్రమాన్ని సుధాకర్ శాస్త్రి – కళావతి అర్చకుల కుటుంబ సమేతంగా కళ్యాణానికి హాజరై పిటలపై నూతన సర్పంచులు ఇరుగు గౌతమీ -వెంకన్న,బాల్య తండా సర్పంచ్ బానోత్ సునీత – రాందాస్ మరియు భక్తులు భూక్యా రామ చంద్రు – శాంతమ్మ,దారావత్ శేఖర్-మంజుల ,భూక్యా భక్షి- హారిక లు కూర్చొని విగ్రహాలతో ఘనంగా కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు.పెద్ద ఎత్తున భక్తుల పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం లాగా దుకాణాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది.
ప్రధాన అర్చకులు సుధాకర చారి- కళావతి, కురవి ఆలయ చైర్మెన్ కోర్ను రవీందర్ రెడ్డి దంపతులు,రాజేందర్ రెడ్డి, నేరడ గ్రామ ఉప సర్పంచ్ దుస్స వెంకన్న,నేరడ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ కమిటీ సభ్యులు పాల రాములు,కొలిపాక అబ్బయ్యా,ఆంజనేయులు – ఉమ,కృష్ణ,గౌరీ శెట్టి అనిల్ దంపతులు గ్రామ పెద్దలు
దూబాకుల అశోక్,బాల్నే సుమన్,కూన సునీత,కుదురుపాక వెంకన్న కనకమ్మ,నూకల దీలిప్ దంపతులు తదితరులు పాల్గొన్నారు.