-మరిపెడలో 9 కాంగ్రెస్,5 బీఆర్ఎస్,1 ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపు
-డోర్నకల్ లో 11 కాంగ్రెస్,4 బిఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు
- క్యాంపునకు తరలిన అధికార పార్టీ కౌన్సిలర్లు
మరిపెడ,ఫిబ్రవరి 13 : హోరా హోరీ గా కొనసాగిన మరిపెడ మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పై చేయి సాధించింది.మహబూబాబాద్ జిల్లా మరిపెడ మునిసిపల్ పీఠంపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసింది.15 వార్డులకు గాను 9వార్డులు కైవసం చేసుకుని విజయ ఢంకా మోగించింది.శుక్రవారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ 9,బీఆర్ఎస్ 5,ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు.కాగా అధికార పార్టీ అభ్యర్థులు క్యాంపునకు తరలివెళ్లారు.కాంగ్రెస్ విజయంతో మరిపెడ పట్టణంలో ప్రభుత్వ విప్,డోర్నకల్ ఎమ్మెల్యే డా. రాంచంద్రునాయక్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వంపై నమ్మకం ఉంచి పట్టం కట్టిన డోర్నకల్,మరిపెడ పట్టణ ప్రజలకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.
మరిపెడ మున్సిపాలిటీలో గెలుపొందిన అభ్యర్థుల వివరాలు…
1వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి ఇస్లావత్ తిరుపతి 74 ఓట్ల మెజార్టితో గెలుపొందగా,2వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి బానోత్ భద్రమ్మ శ్రీను 116 ఓట్లు మెజార్టీ,3వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పానుగోత్ రాములు 20 ఓట్లు,4వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి మెరుగు రాము 58 ఓట్లతో,5వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి బోడ భాస్కర్ 48 ఓట్లు,6వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కాలం సునిత రవీందరెడ్డి 151 ఓట్లు,7వ వార్డు కాంగ్రెస్ అభ్యర్ధి మండన్ కాంతమ్మ 117 ఓట్ల,8వ వార్డు కాంగ్రెస్ అభ్యర్ది వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి 6 ఓట్ల,9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి గుగులోత్ నీల లచ్చిరాం 111 ఓట్ల,10వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి బాదావత్ బేబీశ్రీ రవి 39 ఓట్లు,11వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి లావుడియా సత్యవతి 176 ఓట్లు,12వ వార్డు స్వతంత్ర అభ్యర్ది గంట్ల గౌతం రెడ్డి 252 ఓట్లు,13వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి గంట్ల సుజాత మహిపాల్ రెడ్డి 68 ఓట్లు,14వ వార్డు కాంగ్రెస్ అభ్యర్ది జాటోత్ సురేష్ 151 ఓట్లు,15వ వార్డు కాంగ్రెస్ అభ్యర్ధి లూనావత్ రమేష్ 216 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
ఇండిపెండెంట్ అభ్యర్థికి అత్యధిక మెజార్టీ..
పోటీ పోటీ ఎన్నికల్లో 12వ వార్డు తరపున బరిలో నిలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థి ఏసీ గుర్తుతో గంట్ల గౌతమ్ రెడ్డి మరిపెడలోనే అత్యధికంగా 252ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
డోర్నకల్ మున్సిపాలిటీలో గెలుపొందిన అభ్యర్థుల వివరాలు…
కాంగ్రెస్ అభ్యర్థులు మాదా లావణ్య శ్రీను,భూక్యా ప్రమీల,బాధవత్ వీరన్న,బాధవత్ హేమలత,కొండేటి రాజకుమారి,తేజవత్ నవీన్,మల్లం ప్రవీణ,బొబ్బల సంధ్య,బడేటి రామ కోటేష్,ఎల్లావుల సువర్ణ,గారే రమేష్ లు గెలుపొందగా,బిఆర్ఎస్ పార్టీ నుండి ధరవత్ రమేష్,గుగులోత్ రాము,బోరగాళ్ళ శరత్,అంగోత్ సైలెజ లు కౌన్సిలర్లుగా గెలుపొందారు.