SSC పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి- జిల్లా విద్యాశాఖ అధికారి వి రాజేశ్వర్

మహబూబాబాద్ :

మార్చిలో జరగబోయే SSC పబ్లిక్ పరీక్షల నిర్వహణపై మహబూబాబాద్ ఐడిఓసిలో CS & DOs లతో జిల్లా విద్యాశాఖ అధికారి సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సమావేశంలో 45 పరీక్షా కేంద్రాలకు గాను 45 చీఫ్ సూపరింటెడ్లు, 45 డిపార్ట్మెంట్ ఆఫీసర్ లకు ఒక రోజు ఓరియెంటేషన్ నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా DEO మాట్లాడుతూ ఈ సంవత్సరం SSC పరీక్షలను పారదర్శకంగా, ప్రశాంతంగా ,పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని 45 పరీక్ష కేంద్రాల్లో శుభ్రత, తాగునీటి సదుపాయం, CCTV, ట్యూబ్ లైట్ , టాయిలెట్ ,డ్యూయల్ బెంచీలు వాటర్ తదితర మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తారని ప్రశ్నాపత్రాల రవాణా, సీలింగ్, తగు జాగ్రత్తలు తీసుకోవాలని, సెంటర్ల సమీప ప్రాంతాల్లో 144 సెక్షన్ విదించబడుతుందని , జిరాక్స్ సెంటర్లు మూసి వేయబడతాయని, సెంటర్ లోకి ఎట్టి పరిస్థితులలో సిఎస్ గాని డివో గాని ఇన్విజిలేటర్ గాని విద్యార్థులు, విధులలో పాల్గొనే ఎవరైనా
సెల్ ఫోన్ గాని, ఎలక్ట్రానిక్ గాడ్జెస్ గాని సెంటర్లోకి తీసుకుపోరాదని సూచించారు. సి ఎస్ డి ఓ లు ఇన్విజిలేటర్ తో ప్రత్యేక సమావేశం నిర్వహించి తగు సూచనలు ఇవ్వాలని ఈ సంవత్సరము మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పరీక్ష నిర్వహించబడతాయని పరీక్షల మధ్యలో విరామం ఉన్నందున టైం టేబుల్ పై విద్యార్థులకు సరైన అవగాహన కల్పించాలని విద్యార్థులు పరీక్షలకు గైహాజరు కాకుండా చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏసీజీ ఈ మందుల శ్రీరాములు DSO అప్పారావు. DCEB సెక్రటరీ బాలాజీ, అన్ని మండల విద్యాశాఖ అధికారులు, సి ఎస్ ,డి ఓ లు కార్యాలయ సిబ్బంది సీనియర్ అసిస్టెంట్లు ఎస్బి శ్రీనివాస్ సిహెచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *