జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్ గుండ్రాతిమడుగు నందు షీ టీం భరోసా సైబర్ క్రైమ్ అవగాహన

మహబూబాబాద్ జిల్లా కురవి:

మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శ్రీ డా”శబరీష్ IPS గారి ఆదేశాల మేరకి కురవి పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండ్రాతిమడుగు జడ్పిహెచ్ఎస్ హై స్కూల్ నందు పోక్సో చట్టం పై, మహిళలపై, పిల్లలపై జరిగే నేరాలపై , అవగాహన కల్పించి వాటిని నివారించడంలో షీ టీమ్, AHTU,భరోసా పాత్రని తెలియచేయడం జరిగింది.

ఈ కార్యక్రమలో షీ టీం SI సునంద గారు మాట్లాడుతూ మహిళల రక్షణ కొరకు షీ టీం బృందం పనిచేస్తుందని ఎలాంటి సమయాల్లో అయినా మహిళలపై, పిల్లలపై అసభ్యకరంగా ప్రవర్తించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎవరైనా విద్యార్థినిలు లేదా మహిళలపై
ర్యాగింగ్,స్ట్రీట్ హరాస్మెంట్, ఫాలో అవ్వడం గానీ,కామెంట్ చేయడం గాని, రాంగ్ కాల్ చేయడం గాని, రాంగ్ మెసేజ్ లు చేయడం గాని, మిస్ బిహేవ్ చేయడం గాని చేసినా,వాట్సాప్, ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్, వంటి సామజిక మధ్యమాలలో గాని ఇంకేవిధంగా నైనా ఇబ్బందులకు గురిచేసిన, అలా చేసిన ప్రతి ఒక్కరిపై చట్టప్రకారం చర్యలు తీసుకొని మహిళకు, విద్యార్థినిలకు న్యాయం జరిగెలా చూస్తూ మరియు మహిళలని, పిల్లలని ఎవరైనా ఏ విదంగాఅయినా ఇబ్బంది పెట్టినా షీ టీమ్ ని నిర్భయంగా సంప్రదించాలని కోరారు, బాధితుల వివరాలు పూర్తిగా గొప్యంగా ఉంచబడును అని తెలిపారు. 18 yrs నిండని పిల్లలపై ఏదైనా ఆగాత్యానికి పాల్పడితే పోక్సో చట్టం ద్వారా కఠినమైన చర్యలు తీస్కుంటామని తెలిపారు. మహిళలు, విద్యార్థినిలు కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే ఈ క్రింది నెంబర్లకు ఫోన్ చేయగలరు మహబూబాబాద్ షీ టీం నెంబర్ 8712656935కి,చైల్డ్ లేబర్స్, చైల్డ్ బెగ్గర్స్, మిస్సింగ్ చిల్డ్రన్, స్కూల్ డ్రాప్ ఔట్స్,1098 కి కాల్ చేయగలరు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ HM కె. జానయ్య, స్కూల్ అధ్యాపక సిబ్బంది మరియు 100 మంది విద్యార్థిని విద్యార్థులు, షీ టీమ్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ సుధాకర్, అరుణ పార్వతి రమేష్ , ఏ హెచ్ టి యు యూనిట్ ఉమెన్ కానిస్టేబుల్ సుప్రజ, భరోసా సిబ్బంది జ్యోత్స్న, రేణుక తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *