రెడ్యాల లో రాఘ వేందర్ రెడ్డి చిత్ర పటానికి నివాళులు..
మహబూబాబాద్ ,రెడ్యాల :
బిగ్ టివి గ్రూప్స్ ఆఫ్ చైర్మన్ వెన్నం విజయ్ కాంత్ రెడ్డి ,TPCC రాష్ట్ర మాజీ కార్యదర్శి ,రాష్ట్ర సవిందాన్ కమిటీ సభ్యులు వెన్నం శ్రీకాంత్ రెడ్డిల తండ్రి వెన్నం రాఘ వెందర్ రెడ్డి ఈనెల 11 న మృతి చెందగా శుక్రవారం రాష్ట్ర రోడ్ల భవనాల మరియ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి ,కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిలు …పరమార్శించి స్వర్గీయ వెన్నం రాఘ వెందర్ రెడ్డి గారి చిత్ర పటానికి పులా మాలలు వేసి నివాళులర్పించారు.
వెన్నం కుటుంబాలను పరామర్శించారు. కీర్తిశేషులు రాఘ వేందర్రెడ్డి మృతి తీరని లోటు అన్నారు. వ్యవసాయం పట్ల మక్కువతో సొంత గ్రామాల్లో ఉండి , వ్యవసాయం చేస్తూ చివరి వరకు గ్రామంలోనే ఉన్నారని కీర్తిశేషులు వెన్నం రాఘ వెందర్ రెడ్డి సేవలను గుర్తు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో TPCC ఉపాధ్యక్షరాలు ఝాన్సీ రెడ్డి పాల్గొన్నారు.