తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ –2026 లో మహబూబాబాద్ జిల్లా పోలీస్ సిబ్బంది ప్రతిభ

మహబూబాబాద్ :

హైదరాబాద్ లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ –2026 లో మహబూబాబాద్ జిల్లా పోలీస్ సిబ్బంది విశేష ప్రతిభ కనబరచి పలు పతకాలు సాధించిన సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ డా. శబరీష్ విజేతలను ఘనంగా అభినందించారు. ఈ సందర్భంగా పతక విజేతలకు శాలువాలు కప్పి, ప్రశంసాపత్రాలు అందజేసి వారి ప్రతిభను కొనియాడారు. ఈ క్రీడా పోటీలలో మహబూబాబాద్ జిల్లా నుండి క్రింది అధికారులు, సిబ్బంది పతకాలు సాధించారు:
ఎం. శ్రీనివాస్,డిఎస్పీ (ఏ.ఆర్ ) – లాన్ టెన్నిస్ టీమ్ ఈవెంట్ స్వర్ణ పతకం
విజయ్ ప్రతాప్, డిఎస్పీ (ఏ.ఆర్ ) – లాన్ టెన్నిస్ టీమ్ ఈవెంట్ – స్వర్ణ పతకం
ఎం. లింగన్న, పీసీ – 42 కి.మీ ఫుల్ మారథాన్ – స్వర్ణ పతకం , క్రాస్ కంట్రీ ఇండివిడ్యువల్ ఈవెంట్ – రజత పతకం, బి. గణేష్, ఏ.ఆర్.పీ.సీ – ఆర్మ్ రెజ్లింగ్ – కాంస్య పతకం, బి. సౌభాగ్య, మహిళా పీసీ – జిమ్నాస్టిక్స్ ఫ్లోర్ – స్వర్ణ పతకం , ట్రెడిషనల్ యోగా – కాంస్య పతకం, ఎ. ఉమా రాణి, మహిళా పీసీ – క్రాస్ కంట్రీ టీమ్ ఈవెంట్ – స్వర్ణ పతకం , ఖో-ఖో – కాంస్య పతకం
జి. రజిని, మహిళా పీసీ – రిథమిక్ పేర్ యోగా – కాంస్య పతకం , ఖో-ఖో – కాంస్య పతకం
ఎం. సంజీత, మహిళా పీసీ – ఆర్టిస్టిక్ సింగిల్ యోగా – కాంస్య పతకం
కె. అనూష, మహిళా పీసీ – ఖో-ఖో మహిళల విభాగం – కాంస్య పతకం
ఎల్. దివ్య, మహిళా పీసీ – ఖో-ఖో మహిళల విభాగం – కాంస్య పతకం
బి. సౌజన్య, మహిళా పీసీ – ఖో-ఖో మహిళల విభాగం – కాంస్య పతకం
ఈ క్రీడా పోటీలలో మహబూబాబాద్ జిల్లా పోలీస్ సిబ్బంది మొత్తం 6 స్వర్ణ పతకాలు, 3 రజత పతకాలు, 10 కాంస్య పతకాలు సాధించి మొత్తం 19 పతకాలు గెలుచుకుని జిల్లా ప్రతిష్టను రాష్ట్ర స్థాయిలో నిలబెట్టారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డా. శబరీష్ మాట్లాడుతూ, తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026 లో మహబూబాబాద్ జిల్లా పోలీస్ సిబ్బంది సాధించిన విజయాలు గర్వకారణమని తెలిపారు. విధి నిర్వహణతో పాటు క్రీడలలో కూడా ప్రతిభ కనబరచడం పోలీస్ సిబ్బంది క్రమశిక్షణ, శారీరక మరియు మానసిక దృఢత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి పోటీలలో పాల్గొని మరిన్ని విజయాలు సాధించాలని విజేతలను ప్రోత్సహించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *