పర్యావరణ ప్రేమికులతో రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ వెయ్యాలి

హరిత మిత్ర అవార్డు గ్రహీత ప్రకృతి ప్రేమికుడు దైద వెంకన్న

మహబూబాబాద్ :

మహబూబాబాద్ పట్టణం నూతన గృహ ప్రవేశం చేసుకుంటున్న జలగం వీరస్వామి.శోభ దంపతులకు శుభాకాంక్షలు తెలిపి వారికి నేరేడు మొక్కను బహుకరించిన ప్రజా హృదయం స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు దైద వెంకన్న. నేను ఇచ్చిన ఈ మొక్క ఆక్సిజన్ ఇస్తుంది అని దీనితో పాటు ఇది ఒక గొప్ప ఆయుర్వేద చెట్టు అని ఈ లాంటి మొక్కలను ప్రభుత్వం స్కూల్స్.కాలేజీలో.గ్రీన్ ల్యాండ్స్. రోడ్స్ కు ఇరువైపులా ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటిన ఈ రోజు తెలంగాణ రాష్ట్రం పచ్చదనంతో కూడిన రాష్ట్రంగా చూడవచ్చని దైద వెంకన్న మాట్లాడుతూ అన్నారు.ఇలాంటి వాటిని ఒక్కసారి ఊహించుకొని చూడండి ఎంత ఆనందంగా ఉంటుందో మరి ఇలాంటి ఆనందం నిజంచేస్తే ఇంక మానవుని జీవితం లో మనసుకు వచ్చే ఆనందాలకు అద్దులు వుండవని తెలిపారు.అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న ప్రకృతి ప్రేమికుల ద్వారా మొక్కలు నటించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక కమిటీ వేసి అంతరించి పోతున్న జీవవైవిధ్యాన్ని కాపాడాలని కోరారు. నేను 18 సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణ కోసం నా భాద్యతగా కృషి చేస్తున్నానని అన్నారు దీని ద్వార నేను పొందిన ఆనందం వేల కట్టలేనిది అని అన్నారు.ఈ కార్యక్రమంలో సంఘమిత్ర గౌరవ అధ్యక్షులు వేల్పుల వీరస్వామి.గుడెల్లి నాగయ్య. కొమిరె ఉప్పలయ్య.సంఘమిత్ర మహిళలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *