మహా తెలంగాణ/ మహబూబాబాద్
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ నగర్ కాలనీలో హోలీ సంబరాలు అంబరాన్ని అంటాయి. చిన్నారులు, యువకులు, మహిళలు, పెద్ద సంఖ్యలో పాల్గొని రంగులు పూసుకుంటూ హోలీ సంబరాలు జరుపుకున్నారు. ఒకరికొకరు హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కాలనీలోని వీధుల్లో తిరుగుతూ పలువురిని కలుపుకుంటూ హోలీ వేడుకల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని సంబరాలు జరుపుకున్నారు.