మహబూబాబాద్ :
మహబూబాబాద్ జిల్లాలో హోలీ వేడుకలు అంబరాన్నంటాయి. జిల్లా కేంద్రంలోని మైత్రి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో 19 వ వార్డు కౌన్సిలర్ అరుణ జ్ఞానేశ్వర్, డాక్టర్లు బాలు నాయక్ సుచిత్ర సిబ్బంది కలసి హోలీ సంబరాల్లో పాల్గొని, డీ.జే పాటలకు నృత్యాలు చేస్తూ సిబ్బందిని ఉత్సాహ పరిచారు. అందరూ ఒక్క చోట చేరి రంగులు చల్లుకుంటూ, నృత్యాలు చేస్తూ హోళీ సంబరాలు చేసుకుంటూ కొద్ది సేపు సేద తీరారు. జిల్లా వ్యాప్తంగా చిన్నారులు, యువతీ యువకులు, పెద్దలు, వృద్ధులు కలసి కులమతాలకు అతీతంగా హోలీ వేడుకల్లో పాల్గొని రంగులు చల్లుకుంటూ, డీజే పాటలకు నృత్యాలు చేస్తూ హోలీ సంబరాలు జరుపుకున్నారు. జిల్లా వ్యాప్తంగా హోలీ వేడుకలు ప్రశాంతంగా జరుగుతున్నాయి.