మహబూబాబాద్:
మైత్రి మల్టీ స్పెషలిటి హాస్పిటల్ లో ఘనంగా ప్రపంచ కిడ్నీ దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా కిడ్నీ రోగులకు పండ్ల పంపిణి చేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ బాలు నాయక్ మాట్లాడుతూ కిడ్నీ రోగులు తప్పనిసరిగా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, కిడ్నీ పనిచేసే విధానాన్ని బట్టి అవసరమైతే డయాలసిస్ కూడా చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందని లేకుంటే ప్రాణానికే ప్రమాదం అని ఆయన తెలిపారు. అనంతరం కిడ్నీ రోగులకు పండ్లు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో రేడియోలోజిస్ట్ డాక్టర్ సైదా వాలి, ఆర్థోపేదిక్ డాక్టర్ నాగార్జున రెడ్డి,డాక్టర్ రియాజ్, మైత్రి ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.