బుధవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రవి రాథోడ్ ఆధ్వర్యంలో తొర్రూర్ పట్టణంలోని మెడికేర్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ హాస్పిటల్ మేనేజ్మెంట్ వారు అత్యావసర సేవలకి సంబంధించిన ఫోన్ నంబర్స్ ని, వారు అంధించే సేవలకు తీసుకునే రుసుములకు సంబంధించిన దరల పట్టికను, ఆసుపత్రులలో పనిచెయు డాక్టర్ ల వివరాలు ఆసుపత్రి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, పిసిపిఎన్డిటి సర్టిఫికేట్ లను కూడా అందరికీ కనిపించే విదంగా ప్రదర్శించాలని, అలాగే ఫైర్ కు సంబంధించిన పరికరాలను అమర్చుకోవాలని తెలిపారు. ఆసుపత్రిలో సూచికల బోర్డు లను ఏర్పాటు చేయాలని, పనిచెయు సిబ్బంది యొక్క వివరాలను, వారి యొక్క అర్హత సర్టిఫికెట్ ల ను ఆసుపత్రులలో వుంచాలని, ఒకవేళ సిబ్బంధిని గాని డాక్టర్ లను కానీ మార్చినట్లైతే, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయమునకు అట్టి వివరములు ముందు గానే తెలియ పరచాలని, బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు ఇచ్చిన సర్టిఫికెట్స్ ను రెన్యూవల్ చేయించుకోవాలని ఆయన పేర్కొన్నారు. విదేశాలలో ఎంబిబిఎస్ చదువుకొని వచ్చిన వారు భారత ప్రభుత్వం వారు నిర్వహించే అర్హత పరీక్ష ఉత్తీర్ణత చెందాలని, అంతేకాకుండా వారి డిగ్రీలు ఎంబిబిఎస్ కు మాత్రమే సమానమని ఎం.డి అని రాసుకోకూడధని ఒకవేళ ఎవరైనా అలా రాసి ప్రజలను తప్పుధోవ పట్టిస్తే వారిపైన క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
తొర్రూరు మెడికేర్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా వైద్యధికారి
02
Jul