కార్పొరేట్ లకు దోచి పెట్టడానికే 3వ సారి ప్రధాని అయ్యావా మోడీ!

సిపిఐ మహబూబాబాద్ పట్టణ 14వ మహాసభలో సిపిఐ జిల్లా కార్యదర్శి బి విజయ సారథి

దేశంలో పేద ప్రజల దేశ సంపదను దోచి కార్పొరేట్ లైన అంబానీ ఆదానీలకే దోచిపెట్టడానికే మూడవసారి ప్రధాని అయ్యావా మోడీ అని సిపిఐ జిల్లా కార్యదర్శి బి విజయసారథి ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పించారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మహబూబాబాద్ పట్టణ 14వ మహాసభ జిల్లా కేంద్రంలోని పేరాల కట్టయ్య ఫంక్షన్ హాల్ అమరజీవి దాస్యం రామ్మూర్తి ప్రాంగణంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ముందుగా అరుణ పతాకాన్ని సిపిఐ మాజీ వార్డు కౌన్సిలర్ బి నీరజారెడ్డి ధర్మన్న ఎగురవేశారు బాణాసంచా కాల్చి సందడి చేశారు
ఈ మహాసభకు జిల్లా కౌన్సిల్ సభ్యులు వెలుగు శ్రావణ్ ఎండి ఫాతిమా అధ్యక్షత వహించారు. ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా హాజరై సిపిఐ జిల్లా కార్యదర్శి బి విజయసారథి మాట్లాడుతూ గత పదకండేళ్లలో దేశానికి మోడీ చేసింది ఏమీ లేదని అన్నారు కేవలం 140 కోట్ల ప్రజలను వదిలిపెట్టి ఊడిగం చేస్తుందని అన్నారు దేశంలో మతోన్మాద రాజకీయాలు చేస్తూ విభజించి పాలిస్తూ దేశంలో అల్లర్లు సృష్టిస్తున్నారని అన్నారు ఆర్ఎస్ఎస్ బిజెపి కలిసి దేశాన్ని బ్రష్టు పట్టిస్తున్నారని కమ్యూనిస్టులు నిజమైన దేశభక్తులని బిజెపి అరాచకాలను రానున్న కాలంలో ప్రజల మధ్యల ఎండగట్టి వారిని ఇంటికి పంపించే రోజులు తొందరలోనే వస్తాయని పి విజయసారథి జోస్యం చెప్పారు ఈ సందర్భంగా రాబోవు మున్సిపాలిటీ ఎన్నికల్లో మహబూబాద్ మున్సిపాలిటీ పరిధిలో అత్యధిక సీట్లు గెలిపించాలని ప్రజలను కోరారు అత్యధిక సీట్లు గెలిపించడం ద్వారా పట్టణంలో మెరుగైన పాలన సేవ ప్రజలందరికీ అందిస్తామని విజయ సారథి అన్నారు, గత పదేళ్లలో మున్సిపాలిటీ అభివృద్ధికి నోచుకోలేదన్నారు శివారు కాలనీలలో ఎక్కడ గొంగడి అక్కడే వేసి ఉందన్నారు సిసి డ్రైనేజీలు సీసీ కాలువలు సిసి రోడ్లు వేయడంలో గత 15లలో మున్సిపాలిటీ నిధులు కేటాయించలేదన్నారు టిఆర్ఎస్ పాలనలో మున్సిపాలిటీలు అద్వానంగా తయారయ్యాయని నూతనంగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు కేటాయించాలని కోరారు రాబోవు మున్సిపాలిటీలో అధిక స్థానాల్లో గెలిచి ప్రజలకు నిస్వార్ధంగా సేవలు అందిస్తామని అన్నారు
సిపిఐ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి అజయ్ సారధి రెడ్డి మాట్లాడుతూ గత 15లలో 2014లో మూడు స్థానాల్లో 2020లో రెండు స్థానాల్లో గెలిచి పట్టణంలోని ఉన్న సమస్యలన్నీటిని మున్సిపాలిటీలో చర్చించామని ఎప్పటికప్పుడు సమస్యలను మున్సిపాలిటీ దృష్టికి తీసుకువస్తూ పోరాటం చేశామన్నారు పట్టణంలో గెలిచిన వార్డులలో వందకు వందశాతం అభివృద్ధి చేశామని అన్నారు రానున్న కాలంలో అత్యధిక సీట్లలో గెలిపించండి సేవ చేస్తామని అన్నారు ఈ సందర్భంగా వందేళ్ల చరిత్ర గల భారత కమ్యూనిస్టు పార్టీ దేశంలో ప్రజల కోసం ఉద్యమిస్తుంది అన్నారు ఈ ప్రాంతంలో కూడా అన్ని వర్గాల ప్రజల కోసం ఉద్యమిస్తుందని రాబోయే జూలై 5 6 తేదీలలో జరుగుతున్న భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా మూడవ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ మహాసభలో పెరుగు కుమార్ రేషపల్లి నవీన్ చింతకుంట్ల వెంకన్న మామిండ్ల సాంబలక్ష్మి వీరవెల్లి రవి వెలుగు శ్రవణ్ ఎండి ఫాతిమా నర శ్రావణ్ తండ సందీప్ , ఆబోతు అశోక్ వంకాయలపాటి చిరంజీవి అజ్మీర వేణు ఎండి మహమూద్ చిదిరాల జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *