మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో బోనాల పండుగ జాతర నిర్వహించారు. సోమవారం పాఠశాలకు బోనాల సెలవు కావడంతో శనివారం విద్యార్థులు ఉపాధ్యాయులు కోలాహాలంతో బోనాలు ఎత్తుకొని జాతరలా జరుపుకున్నారు. బోనాల సందడితో పాఠశాల వాతావరణం బోనాల జాతరను మైమరిపించింది. విద్యార్థులు బోనాల విశిష్టతను గురించి ప్రత్యక్షంగా తెలుసుకుని ఆటపాటలతో బోనాల పండుగ జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం జి.లక్ష్మణరావు ఉపాధ్యాయినులు గాయత్రి, లావణ్య, రమణమ్మ, పల్లవి అరుణ,వనజ, సునీత, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
బయ్యారం బాలికల పాఠశాలలో బోనాల జాతర
19
Jul