ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ శనివారం సాయంత్రం కురవి మండలంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం పిల్లలతో కలిసి భోజనం చేసి వారితో ముచ్చటించారు, ప్రభుత్వ కల్పించిన డైట్ మెనూ ప్రకారం సుచి శుభ్రమైన పౌష్టిక ఆహారాన్ని అందించాలని,
పిల్లలకు షెడ్యూల్ ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు, వసతి గృహంలోని పరిసరాలను నిత్యం సానిటేషన్ చేస్తూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని హాస్టల్ సిబ్బందిని ఆదేశించారు. పిల్లల యొక్క మానసిక ఆరోగ్య స్థితిగతులను గమనిస్తూ ఉండాలని మానసిక వైద్య నిపుణుల చేత కౌన్సెలింగ్ నిర్వహించాలని సూచించారు. వినూత్నమైన డిజిటల్, ఏఐ ద్వారా ప్రతి సబ్జెక్టులో అర్థమయ్యే రీతిలో అభ్యసన సామర్ధ్యాలు సాధించేలా అర్థవంతంగా బోధన చేయాలినీ తెలిపారు. కలెక్టర్ వెంట స్థానిక తాసిల్దార్ విజయ, సంబంధిత సిబ్బంది ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *