సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సూర్ణపు సోమయ్య
కమ్యూనిస్టు పార్టీ సానుభూతిపరులు నాయకులు కామ్రేడ్ అలువాల రాజయ్య గారు మృతిచెందడం కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని నష్టమని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ సుర్ణపు సోమయ్య గారు అన్నారు
సోమవారం పత్తిపాక ప్రాంతానికి చెందినటువంటి సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు అలువాల రాజయ్య అనారోగ్యంతో మృతిచెందగా ఆయన మృతదేహాన్నికి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఎర్ర పతాకాన్ని కప్పి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సోమయ్య గారు మాట్లాడుతూ అలువాల రాజయ్య తన చిన్నతనం నుంచి కమ్యూనిస్టు ఉద్యమానికి ఆకర్షితులై సిపిఎం పార్టీలో చేరి పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఉద్యమాలు నిర్మించి పత్తిపాక ప్రాంతంలో భూ పోరాటాలు నిర్వహించి అనేకమంది పేద ప్రజలకు ఇంటి జాగాలు పంచడంలో భాగస్వామ్యులై ఎర్రజెండాను ప్రతిపాక ప్రాంతంలో నిలబెట్టడంలో ముఖ్యపాత్ర పోషించినంటి రాజయ్య గారు మన నుండి దూరం అవడం చాలా దురదృష్టకరమని అన్నారు సిపిఎం పార్టీలో కీలకంగా పనిచేస్తూనే ప్రజాసంఘాల నిర్మానిస్తూ పత్తిపాక ప్రాంతానికి పెద్దన్న పాత్ర వహించినటువంటి వ్యక్తి పత్తిపాకలో అందరివాడుగా కొనసాగిన రాజయ్య గారి మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి ఆ ప్రాంతానికి తీరని నష్టమని వారికి మరోసారి ఘనమైన నివాళులర్పిస్తూ వారి కుటుంబానికి ధైర్యంగా ఉండాలని ఓదార్చడం జరిగింది సోమయ్య గారితో పాటు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సమ్మెట రాజమౌళి సిపిఎం పార్టీ టౌన్ కమిటీ సభ్యులు బానోతు వెంకన్న, హేమా నాయక్, మందుల మహేందర్, పులిగుజ్జు వెంకన్న, లాలయ్య ఎర్ర శ్రీనివాస్, ఎండి రజాక్ అలువాల ఆనంద్ సిపిఎం పార్టీ సభ్యులు కమ్యూనిస్టు అభిమానులు తదితరులు తదితరులు పాల్గొని నివాళులర్పించారు