ఎంసిపిఐయు జిల్లా కార్యదర్శి వెంకన్న
కేసముద్రం, జులై 21:
కేసముద్రం మున్సిపాలిటీ కేంద్రంలోనీ మహాత్మ జ్యోతిరావు పూలే సెంటర్లో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలలో భాగంగా కొత్త పెన్షన్లు వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల కు పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఎంసిపిఐ(యు )పార్టీ ఏఐసీటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం సామూహిక నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఈసందర్బంగా ఎంసిపిఐ(యు )పార్టీ ఏఐసీటియు జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న మాట్లాడుతూ గత బి ఆర్ ఎస్ పాలనలో నేటి కాంగ్రెస్ రెండు సంవత్సరాల కాలంలో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా పెన్షన్లు మంజూరు కాక మీసేవ సెంటర్లో వేలాది మంది దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్నారని అన్నారు. నేటికీ పింఛన్లు మంజూరు కాకపోవడంతో లబ్ధిదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసి కొత్త పెన్షన్లు మంజూరు చేసి లబ్ధిదారులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేనిచో లబ్ధిదారుల పక్షాన జిల్లా వ్యాప్తంగా ప్రజా ఆందోళనలు, ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు .ఈ కార్యక్రమంలో ఎం సి పి ఐ (యు )జిల్లా సహాయ కార్యదర్శి నూకల ఉపేందర్, బోడ వీరన్న, నేరడ వీరస్వామి, నారా బోయిన రాజు ,నాగేంద్ర, బుచ్చమ్మ, పందుల ఎల్లమ్మ ,వల్లందాస్ పుష్ప, వి ఊర్మిళ ,కె పద్మ, వి భాగ్యలక్ష్మి, ఎస్ పూలమ్మ ,జి భూలక్ష్మి, బి అనసూర్య తదితరులు పాల్గొన్నారు.