కేసముద్రం లో మందిర అర్చక పురోహిత్ సమావేశం

కేసముద్రం, జులై 21:

కేసముద్రం మున్సిపాలిటీ కేంద్రం లోని రామాలయం లో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో మందిర అర్చక పురోహిత్ ప్రఖండ సమావేశం ప్రఖండ అధ్యక్షులు సురేందర్ అధ్యక్షతన సోమవారం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అథిదిగా విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర మందిర అర్చక పురోహిత్ సహ ప్రముఖ్ వోరుగంటి సురేష్ కుమార్ పాల్గొని మాట్లాడారు. హిందూ సమాజం లో అర్చకులు, పురోహితుల పాత్ర, విశిష్టత, హిందూ సమాజాన్ని జాగృత పరచడంలో, హిందూ ధర్మ రక్షణ లో అర్చక, పురోహితుల పాత్ర గురించి వివరించారు.
…కేసముద్రం మందిర అర్చక పురోహిత్ ప్రఖండ టోలీ…

ప్రముఖ్ గా:గుడి అనంత రాములు, సహ ప్రముఖ్ గా పుల్లెల విజయ భాస్కర శర్మ,
సంపర్క్ ప్రముఖ్ గా బెజ్జంకి శరత్ చారీ, సేవా ప్రముఖ్ గా యశ్వంత్ చార్య, బ్రాహ్మణేతర పూజారి, ఆరింధల ప్రభాకరా చారి, ప్రశిక్షణా ప్రముఖ్ గా గాంతి వెంకటరెడ్డి, మందిర అర్చక పురోహిత్ జిల్లా టోలీలో బ్రాహ్మణ పూజారి ప్రముఖ్ గా గంప శ్రావణ్ కుమార్ లను నియుక్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఖమ్మం విభాగ్ సంఘటన కార్యదర్శి గడిదేశి వెంకటేశ్వర్లు , జిల్లా అధ్యక్షులు పి.కృష్ణమోహన్ , జిల్లా కార్యదర్శి మెరుగు నరేష్ , జిల్లా సహ కార్యదర్శి దిలీప్, మానుకోట ‌నగర అధ్యక్షులు కొమ్ము కేశవరావు , ప్రఖండ ఉపాధ్యక్షులు కరుణాకర్, ప్రఖండ పరిధిలోని వివిధ గ్రామాల అర్చకులు, పురోహితులు పాల్గొన్నారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *